ప్రేమలు బ్యూటీ "మమితా బైజు" అసలు పేరు ఏంటో తెలుసా..?

Pulgam Srinivas
కొంత మందికి ఎన్ని సినిమాల్లో నటించిన రాని క్రేజ్ మరి కొంత మంది నటీమణులకు మాత్రం ఒకే సినిమాతో వచ్చేస్తుంది. అలా ఒకే సినిమాతో అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న యువ నటీ మణులలో మమితా బైజ్ ఒకరు. ఈమె కొంత కాలం క్రితమే మలయాళం లో రూపొందిన ప్రేమలు అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. మొదట మలయాళం లో విడుదల అయ్యి అద్భుతమైన విజయం సాధించిన ఈ మూవీ ని ఆ తర్వాత తెలుగు లో కూడా విడుదల చేశారు.

అప్పటికే మలయాళం లో అద్భుతమైన విజయం సాధించి ఉండడంతో ఈ మూవీ పై తెలుగు ప్రేక్షకులు కూడా మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా భారీ అంచనాల నడుమ తెలుగు లో విడుదల అయిన ఈ సినిమా టాలీవుడ్ ప్రేక్షకులను కూడా ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాలో మమత కూడా తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ బ్యూటీ కి ఒకే ఒక్క సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో కూడా మంచి గుర్తింపు ఏర్పడింది. ఇకపోతే తాజాగా ఈ బ్యూటీ ఓ ఇంటర్వ్యూ లో పాల్గొంది.

అందులో భాగంగా తన అసలు పేరు ఇది కాదు అని , వేరే ఉంది అని , ఇలా మారడానికి గల కారణాలను ఈ బ్యూటీ చెప్పుకొచ్చింది. తాజాగా మమిత మాట్లాడుతూ ... చిన్న తనంలో ఈమెకు నమిత అనే పేరు పెట్టగా ... బర్త్ సర్టిఫికెట్ లో పొరపాటున దానిని మమత అని రాశారట. దానితో ఆ తర్వాత పాఠశాలలో అదే కొనసాగి మమత అన్న పేరే స్థిరపడిందని ఈ బ్యూటీ తాజా ఇంటర్వ్యూ లో భాగంగా పేర్కొంది. ప్రేమలు మూవీ తెలుగు లో కూడా మంచి విజయం సాధించడంతో ఈ బ్యూటీ కి ప్రస్తుతం అనేక టాలీవుడ్ సినిమాల నుండి ఆఫర్లు వస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ప్రేమలు మూవీ ఈ బ్యూటీ కి 16వ సినిమా.

మరింత సమాచారం తెలుసుకోండి:

mb

సంబంధిత వార్తలు: