ఆ మూవీ తర్వాత నాకు సౌత్ లో అవకాశాలు రాలేదు... ఇలియానా..!

Pulgam Srinivas
గోవా బ్యూటీ ఇలియానా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె రామ్ పోతినేని హీరోగా వై వి ఎస్ చౌదరి దర్శకత్వంలో రూపొందిన దేవదాసు సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ సూపర్ సక్సెస్ కావడం అలాగే ఇందులో ఈమె తన నటనతో , అంతకు మించిన అందాలతో ప్రేక్షకులను కట్టిపడేయడంతో ఈ మూవీ తర్వాత ఈమెకు స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కాయి.

అందులో భాగంగా ఈమె నటించిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయాలను సాధించడంతో చాలా తక్కువ కాలం లోనే ఈమె టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స్థాయికి వెళ్ళి పోయింది. తెలుగు లో స్టార్ హీరోయిన్ స్థాయికి వెళ్లి వరుస అవకాశాలు దక్కుతున్న సమయం లోనే ఈమె హిందీ సినీ పరిశ్రమ వైపు ఇంట్రెస్ట్ చూపించింది. అందులో భాగంగా హిందీ లో పలు సినిమాలలో కూడా నటించి అందులో కొన్ని మూవీలతో మంచి విజయాలను కూడా అందుకుంది.

ఇకపోతే తాజాగా ఇలియానా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొంది. ఆ ఇంటర్వ్యూ లో భాగంగా తనకు సౌత్ సినిమా ఇండస్ట్రీ నుండి తగినంత గుర్తింపు రాలేదు అని చెప్పుకొచ్చింది. తాజా ఇంటర్వ్యూ లో భాగంగా ఇలియానా మాట్లాడుతూ ... ఇండస్ట్రీ లో నాకు రావాల్సిన గుర్తింపు రాలేదు. అందుకు కారణం కూడా నాకు తెలియదు అని ఇలియానా చెప్పుకొచ్చింది.

అలాగే హిందీ లో బర్ఫీ సినిమా చేశాక సౌత్ సినిమా ఇండస్ట్రీ నుండి నాకు సినిమా ఆఫర్ లు రాలేదు. అక్కడి నిర్మాతలు , దర్శకులు నేను బాలీవుడ్ ఇండస్ట్రీ లో సెటిల్ అయ్యాను అని అనుకున్నారు. మంచి కథ దొరికితే నేను ఎక్కడైనా నటించడానికి ఆ సమయం లో సిద్ధంగా ఉన్నా. కానీ నాకు అవకాశాలు ఇచ్చేందుకు ఎవరు ముందుకు రాలేదు అని ఇలియానా తాజాగా ఓ ఇంటర్వ్యూ లో భాగంగా చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: