విజయ్ దేవరకొండ కొత్త ప్రయోగం !

Seetha Sailaja
వరస ఫ్లాప్ లతో సతమతమైపోతున్న విజయ్ దేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్’ మూవీ పై పెట్టుకున్న అంచనాలు ఏమాత్రం వాస్తవ రూపం దాల్చకపోవడంతో మరొకసారి పరాజయం బాట పట్టాడు. ‘గీత గోవిందం’ లాంటి బ్లాక్ బష్టర్ ఇచ్చిన పరుశురామ్ కూడ విజయ్ దేవరకొండను ఫ్లాప్ ల నుండి రక్షించలేకపోయాడు అనుకోవాలి.

ఈపరిస్థితుల మధ్య విజయ్ దేవరకొండ తన లేటెస్ట్ మూవీని గౌతమ్ తిన్న నూరి తో చేస్తున్న విషయం తెలిసిందే. ఫీల్ గుడ్ మూవీలను ఫ్యామిలీ సెంటిమెంట్ తో తీయగల సమర్థుడు అయిన గౌతమ్ తిన్న నూరి కాంబినేషన్ లో విజయ్ కు కోరుకున్న సూపర్ హిట్ వస్తుందని అతడి అభిమానులు ఆశిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్య ఈమూవీకి సంబంధించి ఇప్పుడు ప్రచారంలోకి వచ్చిన ఒక షాకింగ్ న్యూస్ చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

హడావిడి చేస్తున్న ఈవార్తలు ప్రకారం ఈమూవీలో పాటలు ఉండవని అంటున్నారు. సీరియస్ జానర్ లో కేవలం నేపధ్య సంగీతం మీద నెరేషన్ ఉంటుంది అన్న వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో తమిళ హీరో కార్తీ నటించిన ‘ఖైదీ’ మూవీ స్టైల్ లో ఈమూవీ స్క్రీన్ ప్లే చాల డిఫరెంట్ గా ఉంటుందని టాక్. సాధారణయంగా టాప్ హీరోల సినిమాలు అంటే పాటలు లేకుండా ఉండటం అన్నది జరగదు.

విజయ్ దేవరకొండ కలలు కంటున్న 200 కోట్ల కలక్షన్స్ మార్క్ ను చేరుకోవాలి అంటే ఆమూవీ మాస్ ప్రేక్షకులకు కూడ బాగా నచ్చాలి. మాస్ ప్రేక్షకులు పాటలు లేని సినిమాను పెద్దగా చూడారు. దీనితో గౌతమ్ తిన్న నూరి చేస్తున్న మరొక ప్రయోగంలో విజయ్ చిక్కుకున్నాడా అన్న సందేహాలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం మీడియం రేంజ్ హీరోల పోటీ విపరీతంగా కొనసాగుతున్న పరిస్థితులలో ఒక హీరోకు కమర్షియల్ సక్సస్ చాల అవసరం. వరస ఫ్లాప్ లు వస్తున్నప్పటికీ విజయ్ కు వరసపెట్టి అవకాశాలు వస్తున్నాయి అంటే ఈ క్రేజీ హీరోకు యూత్ లో ఉన్న క్రేజ్ ప్రధానకారణం..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: