దానిపైనే ఫోకస్ పెట్టనున్న ఇస్మార్ట్ బ్యూటీ..!!

murali krishna
సినీ పరిశ్రమలో స్థిరపడటం అంటే మాములు విషయం కాదు. అలాంటిది హీరోయిన్స్ విషయంలో ఇంకా కష్టం. ఇండస్ట్రీలో ఎన్నోరకాలుగా కష్టసుఖాలు అనుభవించి తన కంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటే తప్ప హీరోయిన్స్ విషయంలో కనీసం పది నుండి పదిహేను సంవత్సరాలు ఉండొచ్చు. కానీ ఈమధ్యలోనే ప్రేమలో పడటం అవి బ్రేక్అప్ అవ్వడం సహజంగా జరుగుతుంటాయి..చిత్ర పరిశ్రమలో ప్రేమలో విఫలమై పెళ్లికి దూరం అయిన వాళ్లు  అలాగే సక్సెస్ అయినా వాళ్లు కూడా ఉన్నారు.హీరోయిన్ నిధి అగర్వాల్‌ ఉత్తరాది భామ మున్నా మైఖేల్‌ అనే హిందీ చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత టాలీవుడ్‌ నుంచి పిలుపు రావడంతో సవ్యసాచి అనే చిత్రంతో అరంగేట్రం చేశారు. కానీ ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించకపోయింది.ఆ తర్వాత ఇస్మార్ట్ శంకర్ లో నటించి సక్సెస్ కొట్టింది. ఆపై తెలుగు, తమిళ భాషల్లో కొన్ని సినిమాలు చేసింది.
ఇక తమిళంలో జయం రవికి జంటగా భూమి అనే చిత్రంతో పరిచయమయ్యారు. ఆ చిత్రం ఓటీటీలో విడుదల కావడంతో ఈమె కెరీర్‌కు పెద్దగా ఉపయోగపడలేదు. ఆ తరువాత నటుడు శింబు సరసన ఈశ్వరన్‌ చిత్రంలో నటించారు. ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేదు. ఆ తరువాత ఉదయనిధిస్టాలిన్‌తో కలిసి కలకతలైవన్‌ చిత్రంలో కనిపించారు. అలా ముగ్గురు ప్రముఖ హీరోలతో చిత్రాలు చేసినా ఆమె కేరిర్ మాత్రం ట్రాక్లో పడలేదు.ఇదిలా ఉంటే నిధి అగ ర్వాల్‌ ప్రేమ వ్యవహారం గురించి రకరకాల వార్తలొస్తున్నాయి. కాగా ఒక నటుడితో పీకల్లోతు ప్రేమలో ఉన్న ఈ బ్యూటీకి అదీ కాస్తా రివర్స్‌ అయినట్లు తాజా సమాచారం. ప్రియుడి గురించి కొన్ని చేదు సంఘటనలు తెలియడంతో అతనితో బ్రేకప్‌ చేసుకున్నట్లు ప్రచారం వైరల వుతోంది.ఇకపై తన పూర్తి దృష్టి కెరీర్ పై ఉంచి ముందుకు వెళ్లానని నిధి అగర్వాల్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: