"ఓటిటి" లోకి ఎంట్రీ ఇచ్చిన లేటెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్..!

Pulgam Srinivas
ఈ మధ్యవకాలంలో తమిళ సినిమా ఇండస్ట్రీ నుండి అనేక సస్పెన్స్ థ్రిల్లర్స్ మిస్టరీ మూవీ స్ వస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే . అందులో భాగం గా ఈ జోనర్ లో వచ్చిన తమిళ సినిమాలు కూడా ఎక్కువ శాతం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇక పోతే తాజాగా వైభవ్ హీరో గా తవరేల్ అనే సస్పెన్స్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ రూపొందింది . నందిత శ్వేతా , తాన్యా హోప్ ఈ మూవీ లో కీలక పాత్రలల్ నటించగా ... షరీఫ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు . ఈ మూవీ కి అర్రోల్ కోరేలి సంగీతం అందించారు.
 

ఈ మూవీ కొంత కాలం క్రితమే మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయ్యింది . ఈ మూవీ విడుదల అయిన తర్వాత బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది . దానితో ఈ మూవీ మంచి విజయం సాధించింది . ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించిన ఈ సినిమా తాజాగా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది . ఈ మూవీ యొక్క డిజిటల్ హక్కులను ప్రముఖ "ఓ టి టి" సంస్థలలో ఒకటి అయినటువంటి అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ దక్కించు కుంది.

అందులో భాగంగా ప్రస్తుతం ఈ సంస్థ వారు ఈ సినిమాను తమ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో  స్ట్రీమింగ్ చేస్తున్నారు. మరి ఇప్పటికే థియేటర్ ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ఈ సినిమా "ఓ టి టి" ప్రేక్షకులను ఏ స్థాయిలో అలరిస్తుందో చూడాలి. ఇకపోతే మిథున్ మిత్ర ప్రొడక్షన్స్ సంస్థ పై రణం అరమ్ తవరేల్ మూవీ ని మధు నాగరాజన్ గ్రాండ్ గా నిర్మించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: