చోటా కె నాయుడు వ్యాఖ్యలకు ఆగ్రహం వ్యక్తం చేసిన హరీష్ శంకర్..!

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన సినిమాటో గ్రాఫర్ లలో చోటా కె నాయుడు ఒకరు. ఈయన ఇప్పటివరకు ఎన్నో సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేసి తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. ఇకపోతే తాజాగా ఈయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూలో భాగంగా ఈయన తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి హరీష్ శంకర్ గురించి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. అందుకు హరీష్ శంకర్ కూడా తనదైన రీతిలో స్పందించాడు.

ఇక తాజా ఇంటర్వ్యూ లో చోటా కె నాయుడు ఏమన్నారు..? దానికి హరీష్ శంకర్ ఏం కౌంటర్ ఇచ్చారు అనే విషయాలను తెలుసుకుందాం. తాజా ఇంటర్వ్యూ లో భాగంగా చోటా కె నాయుడు మాట్లాడుతూ ... నేను ఇప్పటివరకు ఎంతోబ్మంది దర్శకులతో పని చేశాను. అందులో ఒక్కొక్కరు ఒక్కోరకంగా ఉంటారు. ఇక తెలుగు సినీ పరిశ్రమలో హరీష్ శంకర్ అనే ఒక డైరెక్టర్ ఉన్నారు. ఆయనతో నేను రామయ్య వస్తావయ్య అనే సినిమా చేశాను. ఇక ఆయన మనం చెప్పింది ఏమి వినడు. అలా కాదన్నా... ఇలా కాదన్నా అంటూ చెపుతూ ఉంటాడు. నేను ఎంతగానో అతనినీ కన్విన్స్ చేయాలని చూశాను.

ఆయన తను ఏ మాత్రం వినడు. దానితో నేనే ఆయన చెప్పింది విని చేసుకుంటూ వెళ్ళిపోయాను. నాకు ఎక్కువక్సేపు కోపం రాదు. ఆ తర్వాత ఆలోచించి అతను ఆ సినిమా గురించి ఎలా అనుకుంటున్నారో అని చెప్పి దాన్ని అక్కడే వదిలేసా అని అన్నాడు. దీనికి హరీష్ శంకర్ స్పందిస్తూ ... ఆ సినిమా వచ్చి ఇప్పటికే  పదేళ్లు అవుతుంది. మీ గురించి నేను ఎక్కడా తప్పుగా మాట్లాడలేదు. కానీ మీరు నా గురించి అవమానకరంగా మాట్లాడారు. ఇక దీన్ని వదిలేయండి. మళ్లీ దీన్ని గెలుక్కోకండి. గెలుకుంటే నేను కూడా రెడీ అంటూ సోషల్ మీడియా వేదికగా హరీష్ శంకర్ స్పందించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: