"ఊరు పేరు భైరవకోన" క్లోజింగ్ కలెక్షన్స్ ఇవే..!

Pulgam Srinivas
యంగ్ హీరో సందీప్ కిషన్ తాజాగా ఊరు పేరు భైరవకోన అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి వి ఐ ఆనంద్ దర్శకత్వం వహించగా .. వర్షా బొల్లమ్మ , కావ్య దాపర్ ఈ సినిమాలో హీరోయిన్ లుగా నటించారు. ఈ మూవీ ఫిబ్రవరి 16 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా బారి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయింది. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన టోటల్ బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యింది. టోటల్ బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ సినిమాకు ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా ఏ ఏరియా లో ఎన్ని కోట్ల కలెక్షన్ లు దక్కాయి అనే వివరాలను తెలుసుకుందాం.

ఈ మూవీ కి నైజాం ఏరియాలో 3.30 కోట్ల కలెక్షన్ లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 85 లక్షల కలెక్షన్ లు , ఆంధ్ర ప్రదేశ్ లో 3.45 కోట్ల కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకు తెలంగాణ మరియు ఆంధ్ర ప్రదేశ్ లో కలిపి 7.60 కోట్ల షేర్ ... 14.65 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. ఈ సినిమాకు కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్ సీస్ లో కలుపుకొని 2.40 కోట్ల కలెక్షన్ లు దక్కాయి. ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 10 కోట్ల షేర్ ... 20.05 కోట్ల గ్రాఫ్ కలెక్షన్ లు దక్కాయి. ఈ మూవీ కి వరల్డ్ వైడ్ గా 10 కోట్ల మేర ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఏ సినిమా 11 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగింది. దానితో ఈ సినిమా టోటల్ బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి ప్రపంచ వ్యాప్తంగా 20 లక్షల నష్టాలను ఎదుర్కొని యావరేజ్ విజయాన్ని అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Sk

సంబంధిత వార్తలు: