"ఆపరేషన్ వాలెంటైన్" క్లోజింగ్ కలెక్షన్స్ ఇవే..!

Pulgam Srinivas
టాలీవుడ్ యువ నటుడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తాజాగా ఆపరేషన్ వాలెంటైన్ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో మనుషి చిల్లర్ హీరోయిన్ గా నటించగా ... రూహాని శర్మ , నవదీప్ ఈ మూవీ లో ముఖ్యమైన పాత్రలలో నటించింది. శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ మంచి అంచనాల నడుమ తెలుగు , హిందీ భాషలలో విడుదల అయింది. ఇకపోతే ఇప్పటికే ఈ మూవీ కి సంబందించిన టోటల్ బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ అయ్యింది. టోటల్ బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్ లు దక్కాయి అనే విషయాలను తెలుసు కుందాం.

టోటల్ బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి ఈ మూవీ కి నైజాం ఏరియాలో 1.07 కోట్ల కలెక్షన్ లు దక్కగా ... సీడెడ్ ఏరియాలో 30 లక్షలు , ఆంధ్ర ప్రదేశ్ లో 1.30 కోట్ల కనెక్షన్ లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 2.67 కోట్ల షేర్ ... 5.25 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. ఈ మూవీ కి కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్ సీస్ లో కలుపుకొని 86 లక్షల కలెక్షన్ లు దక్కాయి. ఈ మూవీ కి మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా 3.53 కోట్ల షేర్ ... 7.20 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. ఈ మూవీ కి ప్రపంచవ్యాప్తంగా ఆరు కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ మూవీ 6.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బారిలోకి దిగింది. ఇకపోతే ఈ మూవీ టోటల్ బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి 2.97 కోట్ల నష్టాలను అందుకొని డిజాస్టర్ గా మిగిలిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Vt

సంబంధిత వార్తలు: