"ప్రేమలు 2" అఫిషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది... రిలీజ్ ఎప్పుడో తెలుసా..?

Pulgam Srinivas
కొన్ని రోజుల క్రితం పెద్దగా అంచనాలు లేకుండా మలయాళంలో విడుదల అయిన ప్రేమలు సినిమా అక్కడ అదిరిపోయే విజయాన్ని అందుకుంది. అలా మలయాళ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా సంచలన విజయం సాధించడంతో ఈ మూవీ ని ఎస్ ఎస్ కార్తికేయ తెలుగులో విడుదల చేశాడు. అప్పటికే ఈ మూవీ మలయాళం లో మంచి విజయం సాధించి ఉండడంతో ఈ మూవీ పై తెలుగు ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అలా భారీ అంచనాల నడుమ తెలుగు లో విడుదల అయిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను కూడా ఎంతగానో అలరించింది.
 

దానితో ఈ మూవీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా ఘన విజయం సాధించింది. ఇక ఇప్పటికే థియేటర్ ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక ప్రస్తుతం ఓ మూవీ కి "ఓ టి టి" ఫాల్ట్ ఫామ్ లో జనాల నుండి అద్భుతమైన రెస్పాన్స్ ను తెచ్చుకుంటుంది. ఇలా ఇప్పటికే ఈ సినిమా ధియేటర్ మరియు "ఓ టి టి" ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ సీక్వెల్ కి సంబంధించిన అధికారిక ప్రకటన వెలుడింది.

తాజాగా ఈ మూవీ బృందం "ప్రేమలు 2" అనే పోస్టర్ ను విడుదల చేసింది. అలాగే ఈ మూవీని వచ్చే సంవత్సరం విడుదల చేయనున్నట్లు కూడా ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇక ఈ చిత్ర బృందం తాజాగా విడుదల చేసిన పోస్టర్ తెలుగులో ఉండడం మరో విశేషం. ఇప్పటికే ప్రేమలు సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించి ఉండడంతో "ప్రేమలు 2" సినిమాపై సాధారణం గానే భారీ అంచనాలు నెలకొనే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: