"టిల్లు స్క్వేర్" కి ఇప్పటివరకు వచ్చిన లాభాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

Pulgam Srinivas
సిద్దు జొన్నలగడ్డ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా రూపొందిన టిల్లు స్క్వేర్ మూవీ కి టాలెంటెడ్ డైరెక్టర్ మల్లిక్ రామ్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. మార్చి 29 వ తేదీన థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా ఇప్పటి వరకు 21 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. 21 రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా ఏరియాల వారీగా వచ్చిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం. అలాగే ఇప్పటివరకు ఈ మూవీ కి ఎన్ని కోట్ల లాభాలు వచ్చాయి అనే వివరాలను కూడా తెలుసుకుందాం.

ఈ మూవీ కి 21 రోజుల్లో నైజాం ఏరియాలో 26.14 కోట్ల కలెక్షన్ లు దక్కగా ... సీడెడ్ ఏరియాలో 5.26 కోట్లు ... ఉత్తరాంధ్రలో 5.73 కోట్లు ... ఈస్ట్ లో 2.97 కోట్లు ... వెస్ట్ లో 1.87 కోట్లు , గుంటూరు లో 2.65 కోట్లు .... కృష్ణ లో 2.38 కోట్లు ... నెల్లూరు లో 1.50 కోట్ల కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకి 21 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 48.50 కోట్ల షేర్ ... 81.80 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. ఇక ఈ మూవీ కి 21 రోజుల్లో కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలుపు కొని 4.43 కోట్ల కలెక్షన్ లు దక్కగా ... ఓవర్ సీస్ లో 15 కోట్ల కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా ఈ మూవీ కి 21 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 67.93 కోట్ల షేర్ ... 120.65 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. 

ఈ మూవీ కి మొత్తం గా ప్రపంచ వ్యాప్తంగా 27 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ మూవీ 28 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బారిలోకి దిగింది. ఈ మూవీ ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 39.93 కోట్ల భారీ లాభాలను అందుకొని జరుపుకున్న ఫ్రీ రిలీజ్ బిజినెస్ కంటే డబల్ లాభాల కంటే కూడా ఈ మూవీ ఎక్కువగా అందుకుంది. ఇక మరికొన్ని రోజుల్లోనే ఈ సినిమా 40 కోట్ల లాభాలను కూడా అందుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Sj

సంబంధిత వార్తలు: