యానిమల్ మూవీని టార్గెట్ చేసిన సిద్ధార్థ్ !

Seetha Sailaja
బొమ్మరిల్లు’ మూవీ అప్పట్లో బ్లాక్ బష్టర్ హిట్ అవ్వడంతో హీరో సిద్ధార్థ్ టాప్ హీరోల రేంజ్ కి వెళ్లిపోతాడని చాలామంది భావించారు. ఆతరువాత కాలంలో వచ్చిన అతడు నటించిన అనేక సినిమాలు ఫెయిల్ అవ్వడంతో టాలీవుడ్ లో అతడి క్రేజ్ బాగా తగ్గింది. అయినప్పటికీ ఈ క్రేజీ హీరో రకరకాల సబ్జెట్స్ తో సినిమాలు చేస్తూ తిరిగి తాను పోగొట్టుకున్న క్రేజీ హీరో స్థానాన్ని సంపాదించుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు.

సినిమా ఫంక్షన్స్ లో అదేవిధంగా తాను నటించే సినిమాల ప్రమోషన్ ఇంటర్వ్యూలలో తన మనసులో ఉన్న మాటను చాలస్పష్టంగా చెప్పే సాహసం సిద్ధార్థ్ తరుచు చేస్తూ ఉంటాడు. ఇలా ముక్కు సూటిగా మాట్లాడటం వల్ల టాలీవుడ్ ఇండస్ట్రీలో సిద్ధార్థకు అవకాశాలు తగ్గాయి అన్న కామెంట్స్ కూడ ఉన్నాయి. లేటెస్ట్ గా ఈహీరో తెలుగు తమిళ భాషలలొ ‘చిన్నా’ సినిమాను తానే నిర్మించి దర్శకత్వం వహించాడు.

అయితే ఆసినిమాకు విమర్శకుల నుండి ప్రశంసలు లభించినప్పటికీ కలక్షన్స్ పరంగా ఆసినిమా వెనకపడింది. ఈమధ్య ఒక అవార్డు ఫంక్షన్ లో హడావిడి చేసిన సిద్ధార్థ్ తన కొత్త మూవీ గురించి మాట్లాడుతూ పరోక్షంగా బాలీవుడ్ చరిత్రలో కలక్షన్స్ తిరగ వ్రాసిన రణబీర్ కపూర్ రష్మిక సందీప్ వంగా కాంబినేషన్ లో తీయబడ్డ ‘యానిమాల్’ మూవీ గురించి పరోక్షంగా కొన్ని ఆశక్తికర విషయాలు తెలియచేశాడు.

ప్రస్తుతం చాలామంది ప్రేక్షకులకు తమ నిజ జీవితాలను కనెక్ట్ చేస్తూ సినిమాలలో సన్నివేశాలను పెడితే చాలామంది బోర్ ఫీల్ అవుతున్నారని అందువల్లనే చిన్న దర్శకులు మాత్రమే కాకుండా పేరు మోసిన పెద్ద దర్శకులు కూడ మంచి సినిమాను తీయలేకపోతున్నారని అయితే ఈమధ్య వచ్చిన ఒక చెత్త సినిమాను పాన్ ఇండియా మూవీగా దేశవ్యాప్తంగా ఆసినిమాకు 9 వందల కోట్లు కలక్షన్స్ వచ్చిన విషయాన్ని గుర్తుకు చేస్తూ ‘యానిమాల్’ మూవీ ప్రస్తావన లేకుండా పరోక్షంగా ఆసినిమాను టార్గెట్ చేస్తూ మంచి సినిమాలను ప్రేక్షకులు ఆదరించరు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు..  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: