అన్ని సంవత్సరాల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ రికార్డ్ ను క్రాస్ చేసిన అల్లు అర్జున్..!

Pulgam Srinivas
సినిమాలు అన్నాక రికార్డులను క్రియేట్ చేయడం... ఆ తర్వాత మరో సినిమా రావడం. ఆ రికార్డును బ్రేక్ చేయడం అనేది చాలా సర్వ సాధారణంగా జరుగుతూ ఉంటుంది. ఇకపోతే కొన్ని సంవత్సరాల క్రితం రికార్డులు చాలా కాలం పాటు పదిలంగా ఉండేవి. ఒక సినిమా భారీ కలక్షన్ లను సాధిస్తే మరో సినిమా వచ్చి ఆ కలెక్షన్ పను క్రాస్ చేయాలి అంటే చాలా కాలం పట్టేది. అలాగే ఏదైనా సినిమా టీజర్ , ట్రైలర్ కు భారీ వ్యూస్ వచ్చాయి అంటే సంవత్సరం తిరగకుండానే మరో సినిమా టీజర్ , ట్రైలర్ ఆ రికార్డులను కోట్టి పారేస్తుంది.

కాకపోతే తెలుగు సినీ పరిశ్రమలో ఓ టీజర్ రికార్డు మాత్రం చాలా కాలం పాటు పదిలంగా ఉంది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొంత కాలం క్రితం "జై లవకుశ" అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ కి బాబీ దర్శకత్వం వహించాడు. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ మూడు విభిన్నమైన పాత్రలలో నటించి తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అలరించాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ ను అందుకుంది. ఇకపోతే ఈ మూవీ టీజర్ ఏకంగా 137 గంటల పాటు యూట్యూబ్ లో టాప్ ప్లేస్ లో ట్రెండ్ అయ్యి సంచలనం సృష్టించింది.

ఇక ఆ ఈ సినిమా తర్వాత అనేక తెలుగు సినిమా టీజర్ లు విడుదల అయినప్పటికీ ఈ మూవీ టీజర్ రికార్డును మాత్రం టచ్ చేయలేకపోయాయి. ఇంత కాలానికి ఈ మూవీ రికార్డు బ్రేక్ అయ్యింది. తాజాగా అల్లు అర్జున్ హీరో గా రూపొందిన "పుష్ప పార్ట్ 2" మూవీ టీజర్ విడుదల అయిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా టీజర్ 138 గంటల పాటు యూట్యూబ్ లో టాప్ ప్లేస్ లో ట్రెండ్ అయ్యి "జై లవకుశ" మూవీ టీజర్ రికార్డును బద్దలు కొట్టింది. ఇలా ఇప్పుడే "పుష్ప పార్ట్ 2" సినిమా రికార్డులను బద్దలు పెట్టడం మొదలు పెట్టింది. మరి సినిమా విడుదల అయ్యాక ఎన్ని రికార్డులను స్మాష్ చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

aa

సంబంధిత వార్తలు: