బాయ్ ఫ్రెండ్ తో విడిపోయిన అనన్య పాండే..!

Divya
టాలీవుడ్, బాలీవుడ్ ప్రేక్షకులకు బాగా సుపరిచితమైంది హీరోయిన్ అనన్య పాండే.. బాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ అమ్మడు.. నిరంతరం ఏదో ఒక విషయంలో వైరల్ గా మారుతూనే ఉంటుంది. సినిమాలో లేదా వ్యక్తిగత విషయాలలో కూడా ఈమె పేరు బాగా వైరల్ గా మారుతోంది.. ముఖ్యంగా బాలీవుడ్ హీరో ఆదిత్య రాయ్ కపూర్ తో ఇమే ప్రేమలో ఉన్నట్లుగా గత కొన్ని నెలలుగా వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ కలిసి పలు రకాల ఈవెంట్స్ కు రెస్టారెంట్స్ కు పార్టీలకు వెళుతూ ఉండేవారట.

దీంతో డేటింగ్ నిజమేనని చాలా మంది నమ్మారు. అయితే ఇప్పుడు వీరిద్దరూ విడిపోతున్నట్లు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా ఈ విషయం వినిపిస్తోంది. రెండేళ్లలోనే వీరి ప్రేమాయణం ముగిసిందా అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి  అందుకు కారణం అనన్య తన ఇంస్టాగ్రామ్ లో పెట్టిన ఒక ఎమోషనల్ పోస్ట్ చూస్తే అర్థమవుతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఒక్కసారిగా అనన్య, ఆదిత్య బ్రేకప్ రూమర్స్ తెర మీదకి వచ్చాయి.
అనన్య  ఇలా రాసుకుంటూ అది నిజంగా నీదే అయితే కచ్చితంగా తిరిగి వస్తుంది.. మీరు దాని నుంచి ఎంత దూరం పెట్టిన తిరిగి మీ వద్దకే వస్తుంది అది సొంతంగా నేర్చుకోవాలనె ఫాటం మీకు మిగులుస్తుంది అంటూ ఒక కొటేషన్ను షేర్ చేసింది. ప్రస్తుతం ఈమె చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. అనన్య పాండే తెలుగులో విజయ్ దేవరకొండ తో కలిసి లైగర్ సినిమాతో లాంచ్ అవ్వగా  ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఆ తర్వాత తెలుగులో ఏ ఒక్క సినిమాలో కూడా నటించలేదు. కేవలం బాలీవుడ్ లోనే వాళ్ళ సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నది అలాగే పలు రకాల వెబ్ సిరీస్లలో కూడా నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: