బుక్ మై షో లో ఆ మూడు మూవీల పరిస్థితి ఇదే..!

Pulgam Srinivas
ప్రెసెంట్ థియేటర్ లలో ఫ్యామిలీ స్టార్ , టిల్లు స్క్వేర్ , మంజుమ్మల్ బాయ్స్ అనే మూడు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర సందడి చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇకపోతే ఈ మూవీ లకు లాస్ట్ 24 గంటల్లో బుక్ మై షో యాప్ లో ఎన్ని టికెట్లు అమ్ముడు పోయాయి అనే వివరాలను తెలుసుకుందాం.

ఫ్యామిలీ స్టార్ : విజయ్ దేవరకొండ హీరో గా మృనాల్ ఠాకూర్ హీరోయిన్ గా పరశురామ్ పెట్ల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా తాజాగా థియేటర్ లలో విడుదల అయ్యింది. ఈ మూవీ కి లాస్ట్ 24 గంటల్లో బుక్ మై షో యాప్ లో 53.33 టికెట్స్ అమ్ముడు పోయాయి. ఈ మూవీ ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్వహించగా ... గోపి సుందర్ ఈ మూవీ కి సంగీతం అందించాడు.

టిల్లు స్క్వేర్ : సిద్దు జొన్నలగడ్డ హీరో గా రూపొందిన ఈ మూవీ లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించగా ... నేహా శెట్టి ఈ మూవీ లో ముఖ్యమైన పాత్రలో నటించింది. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ ఈ మూవీ ని నిర్మించాడు. ఈ మూవీ మార్చ్ 29 వ తేదీన థియేటర్ లలో విడుదల అయ్యి ఇప్పటికే భారీ విజయాన్ని అందుకుంది. ఇకపోతే లాస్ట్ 24 గంటల్లో బుక్ మై షో యాప్ లో ఈ మూవీ.కి సంబంధించిన 70.57 కే టికెట్లు అమ్ముడు పోయాయి.

మంజుమ్మల్ బాయ్స్ : ఈ సినిమా ఇప్పటికే మలయాళ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ మూవీ ని ఈ రోజు తెలుగు లో విడుదల చేశారు. ఇకపోతే ఆఖరి 24 గంటల్లో బుక్ మై షో యాప్ లో ఈ సినిమాకు సంబంధించిన 30.61 టికెట్లు అమ్ముడు పోయాయి.

ఇలా ఈ మూడు సినిమాలలో ఆఖరి 24 గంటల్లో బుక్ మై షో యాప్ లో మంచి రెస్పాన్స్ లభించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: