నాకు పెళ్లి కావడం కష్టమే... ముంతాజ్..!

Pulgam Srinivas
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా రూపొందిన ఖుషి మూవీన్లో ముంతాజ్ ఒక చిన్న పాత్రలో నటించింది. అలాగే ఈ సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ లో కూడా నటించింది. ఇక ఈ మూవీ బ్లాక్ బాస్టర్ విజయం సాధించడం ... ఇందులో ఈ ముద్దు గుమ్మ నటించిన సాంగ్ సూపర్ సక్సెస్ కావడం అలాగే ఈ బ్యూటీ ఈ సినిమాలో తన నటనతో కూడా ప్రేక్షకులను ఎంతగానో అలరించడంతో ఖుషి మూవీ ద్వారా ఈ బ్యూటీ కి తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు లభించింది.

ఇక ఆ తర్వాత ఈమె తెలుగు లో చిన్నచితకా సినిమాలలో నటించిన ఆ మూవీ ల ద్వారా ఈమె ఒక పెద్దగా దక్కలేదు. ఇక చాలా సంవత్సరాల గ్యాప్ తీసుకున్న ఈమె ఆ తర్వాతే మళ్ళీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన అత్తారింటికి దారేది సినిమాలో ఐటెం సాంగ్ లో నటించింది. ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించడం అలాగే ఈ సినిమాలోని ఈ పాట కూడా సూపర్ సక్సెస్ కావడంతో మరోసారి ఈమె పేరు తెలుగు సినీ పరిశ్రమలో మారు మోగింది.

ఇలా ఇప్పటివరకు తెలుగు లో మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈమె తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొంది. అందులో భాగంగా ఈమె తనకు ఉన్న సమస్యల గురించి ... తన పెళ్లి గురించి కొన్ని విషయాలను చెప్పుకొచ్చింది ...  తాజాగా ముంతాజ్ మాట్లాడుతూ ... తనకు ఆటో ఇమ్యూన్ అనే వ్యాధి ఉన్నట్లు చెప్పింది. ఈ వ్యాధితో ఎముకల జాయింట్స్ లో ఇబ్బందికరమైన నొప్పి కలుగుతుంది అని ... మా అన్నయ్య మద్దతు లేకుండా ఉన్నట్లు అయితే నేను ఇప్పటికే ఆత్మహత్య చేసుకునే దానిని అని చెప్పింది. నాకు ఇప్పుడు 43 సంవత్సరాల వయస్సు. ఈ వయస్సులో నాకు పెళ్లి జరుగుతుంది అనే నమ్మకం లేదు అని ముంతాజ్ చెప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: