మరో ఓటీటీలోకి వచ్చేస్తున్న బ్లాక్ బస్టర్ 'ప్రేమలు' మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

murali krishna
మలయాళం బ్లాక్ బస్టర్ మూవీ “ప్రేమలు”..ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై భారీ విజయాన్ని అందుకుంది..మలయాళంలో సూపర్ హిట్ అయిన ఈ సినిమాను ను తెలుగు లో డైరెక్టర్ రాజమౌళి తనయుడు కార్తీకేయ విడుదల చేసిన సంగతి తెలిసిందే.మార్చి 8న ఈ మూవీ తెలుగులో విడుదలై తెలుగు ప్రేక్షకులను ఎంతాగానో ఆకట్టుకుంది. ఈ మూవీ లో మలయాళీ నటీనటులు నస్లెన్ కె గపూర్, మ్యాథ్యూ థామస్ మరియు మమితా బైజు ప్రధాన పాత్రలు పోషించారు.ఈ చిత్రానికి గిరీష్ ఎ.డి దర్శకత్వం వహించారు. యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ గా ఈ మూవీ హైదరాబాద్ నేపథ్యంలో తెరకెక్కింది. ప్రేమలు మూవీ నేటి యూత్ ని విశేషంగా ఆకట్టుకుంది. ఈ సినిమా తో హీరోయిన్ మమితా బైజు కు తెలుగు లో మంచి క్రేజ్ వచ్చింది. తెలుగులో ఈ బ్యూటీకి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్ప్డింది. 

ఇదిలా ఉంటే థియేటర్లలో ఎంతగానో అలరించిన ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే ఈ విషయం పై అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. ఏప్రిల్ 12 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కానుందని అధికారికంగా వెల్లడిస్తూ కొత్త పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ఈ ప్రేమ మరింత వైరల్ అవుతుంది అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది.ప్రేమలు మూవీ ఇప్పుడు మరో ఓటీటీలోకి కూడా వచ్చేస్తుంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ తో పాటు.. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో కూడా ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఏప్రిల్ 12 నుంచి ఈ మూవీ అందుబాటులోకి రానుందని మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు. అయితే మలయాళీ వెర్షన్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుండగా.. తెలుగు వెర్షన్ ఆహాలో అందుబాటులో ఉండనుందని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: