అఫిషియల్ : "ప్రేమలు" తెలుగు వర్షన్ "ఓటిటి" విడుదల తేదీ వచ్చేసింది..!

Pulgam Srinivas
గిరీష్ ఏడి దర్శకత్వం లో ప్రేమలు అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే . మలయాళం లో రూపొందిన ఈ సినిమా పెద్దగా అంచనాలు లేకుండా మొదట మలయాళం లో మాత్రమే విడుదల అయ్యింది . ఈ సినిమా విడుదల అయిన తర్వాత అద్భుతమైన టాక్ ను తెచ్చుకుంది . దానితో ఈ సినిమాకి రోజు రోజుకు కలెక్షన్ లు పెరుగుతూ వచ్చాయి . దానితో ఈ సినిమా మలయాళ ఇండస్ట్రీ లో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది . ఇక ఆ తర్వాత ఈ సినిమాని ఎస్ ఎస్ కార్తికేయ తెలుగు లో విడుదల చేశాడు.
 

మలయాళం లో మంచి విజయం సాధించిన ఈ సినిమా తెలుగు లో కూడా భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా సూపర్ సక్సెస్ ను అందుకుంది . ఇకపోతే ఇప్పటికే థియేటర్ ప్రేక్షకులను ఎంత గానో అలరించిన ఈ సినిమా మరికొన్ని రోజుల్లో "ఓ టి టి" ప్రేక్షకులను కూడా అలరించబోతుంది. తాజాగా ఈ మూవీ యొక్క తెలుగు వర్షన్ "ఓ టి టి" విడుదలకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలు వడింది.

ఈ సినిమా యొక్క తెలుగు వర్షన్ "ఓ టి టి" హక్కులను ఆహా సంస్థ దక్కించుకుంది . అందులో భాగంగా ఈ సంస్థ వారు ఈ సినిమా తెలుగు వర్షన్ ను ఏప్రిల్ 12 వ తేదీ నుండి స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది . ఇది ఇలా ఉంటే ఇప్పటికే థియేటర్ ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ఈ సినిమా "ఓ టి టి" ప్రేక్షకులను ఏ స్థాయిలో అలరిస్తుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: