ఆ విషయంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసంతృప్తిగా ఉన్నారా..?

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ మాస్ ఇమేజ్ కలిగిన హీరోలలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. ఈయన సినిమా విడుదల అవుతుంది అంటే ఆయన అభిమానులు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న థియేటర్ లలో సందడి వాతావరణాన్ని తీసుకువస్తూ ఉంటారు. ఇక ఎన్టీఆర్ సినిమా టాక్ తో సంబంధం లేకుండా భారీ మొత్తంలో కలెక్షన్ లను వసూలు చేస్తూ ఉంటుంది. అదే కనుక ఎన్టీఆర్ మూవీ కి కనుక బ్లాక్ బాస్టర్ టాక్ వచ్చినట్టు అయితే కలెక్షన్ ల వర్షం కురుస్తూ ఉంటుంది. ఇకపోతే ఇంతటి క్రేజ్ కలిగిన ఈ హీరో సోలో సినిమా చేసి చాలా కాలం అవుతుంది.

ఎప్పుడో 2018 వ సంవత్సరం విడుదల అయినటువంటి "అరవింద సమేత" సినిమాతో సోలో హీరో గా ఎన్టీఆర్ ప్రేక్షకులను అలరించాడు. ఆ తరువాత ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన "ఆర్ ఆర్ ఆర్" అనే సినిమాతో సూపర్ క్రేజ్ ను మంచి విజయాన్ని అందుకున్నప్పటికీ ఇందులో ఎన్టీఆర్ తో పాటు రామ్ చరణ్ కూడా హీరో గా నటించాడు. ఈ సినిమా విజయంలో సగ భాగం ఆయన కూడా తీసుకున్నాడు. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ "దేవర" అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ సినిమా విడుదలకు ఇంకా చాలా కాలం ఉంది.

అలాగే ఎన్టీఆర్ దేవర సినిమా తర్వాత "వార్ 2" మూవీ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాలో కూడా ఎన్టీఆర్ తో పాటు హృతిక్ రోషన్ కూడా హీరోగా కనిపించబోతున్నాడు. ఇలా తమ అభిమాన హీరో ఎక్కువ శాతం సోలో హీరో సినిమాల్లో కాకుండా మల్టీ స్టార్ మూవీ లలో నటిస్తూ ఉండడంతో ఈయన అభిమానులు కాస్త అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. కానీ మరి కొంత మంది మాత్రం ఎన్టీఆర్ ఏ సినిమా చేసిన ఆచితూచి చేస్తాడు. అభిమానులను , ప్రేక్షకులను అలరించే విధంగానే ఆయన సినిమాలు ఉంటాయి అని తమ భావాన్ని వ్యక్తపరుస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: