షాక్ ఇస్తున్న తేజ సజ్జా నెక్స్ట్ మూవీ బడ్జెట్ ?

Purushottham Vinay
తెలుగు యంగ్ హీరో తేజ సజ్జ  సంక్రాంతి పండుగకి వచ్చి హనుమాన్ సినిమాతో డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. యంగ్  డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ మూవీలో హనుమంతు పాత్రలో తన యాక్టింగ్ తో అదరగొట్టారు తేజ.ఇక చైల్డ్ ఆర్టిస్ట్ గా మూడేళ్ల వయసులోనే సినీ కెరీర్ స్టార్ట్ చేసిన తేజ సజ్జ.. టాలీవుడ్ టాప్ హీరోలు చిరంజీవి, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ వంటి పలువురు సూపర్ స్టార్స్ సినిమాల్లో నటించారు.తెలుగు జనాలకు బాగా దగ్గరయ్యారు. తేజ గతేడాది ఇండస్ట్రీలో అడుగుపెట్టి 25 ఏళ్లు పూర్తి చేసుకోవడం గమనార్హం. 2019లో సమంత లీడ్ రోల్ లో నటించిన ఓ బేబీ సినిమాలో స్పెషల్ రోల్ లో కనిపించారు.ఆ తర్వాత హీరోగా మారి వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. హీరోగా ఫస్ట్ సినిమా జాంబిరెడ్డితో మంచి హిట్ అందుకున్నాడు తేజ. ఆ తరువాత ఇష్క్, అద్భుతం సినిమాలు చేశారు. కానీ హనుమాన్ సినిమా తేజ సజ్జ కెరీర్ మలుపు తిప్పేసింది. ఏకంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ సినిమాతో తేజ సజ్జ క్రేజ్ ఒక్కసారిగా అమాంతం పెరిగిపోయింది. ఇక తేజ చేయబోయే తరువాత మూవీస్ పై అందరి దృష్టి పడింది.ప్రస్తుతం తేజ సజ్జ.. మిరాయ్ అనే మూవీతో బాగా బిజీ గా గడుపుతున్నారు.


హనుమాన్ సినిమా కంటే ముందు ఈ మూవీ స్టార్ట్ చేశారు తేజ.అప్పుడు కొంచెం షూటింగ్ జరగ్గా.. ఇప్పుడు పూర్తి అయ్యింది. రవితేజ ఈగల్ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కిస్తున్న ఈ మూవీ మంచి యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీలో టాలీవుడ్ హీరో మంచు మనోజ్.. గెస్ట్ రోల్ లో కనిపించనున్నారు.పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా బడ్జెట్ ఇప్పుడు ఇండస్ట్రీలో వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.రూ.40-45 కోట్ల ఖర్చుతో ఈ సినిమా తీస్తున్నారని సమాచారం తెలుస్తోంది. మొదట్లో ఈ సినిమా బడ్జెట్ కూడా తక్కువే అనుకున్నారట. కానీ తేజ సజ్జకు పెరిగిన క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని మేకర్స్ స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు చేసినట్లు ఆ మధ్య వార్తలు కూడా వచ్చాయి. అందువల్ల బడ్జెట్ భారీగా పెరిగిందట.హనుమాన్ కన్నా  ఎక్కువ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మితమవుతుంది. 2024లోనే విడుదల కానున్న ఈ సినిమాతో తేజ హనుమాన్ లాంటి హిట్ ని అందుకుంటాడో లేడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: