చిరు.. ఎన్టీఆర్.. రవితేజ.. నితిన్ మూవీస్ షూటింగ్ వివరాలు ఇవే..!

Pulgam Srinivas
మెగాస్టార్ చిరంజీవి , యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ , మాస్ మహారాజా రవితేజ ,  యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం సినిమా షూటింగ్ లతో బిజీగా సమయాన్ని గడుపుతున్నారు. ప్రస్తుతం వీరు నటిస్తున్న సినిమాలు ఏవి ..?  ఆ మూవీ లకు సంబంధించిన షూటింగ్లు ఏ ప్రాంతంలో జరుగుతున్నాయి అనే వివరాలను క్లియర్ గా తెలుసుకుందాం.
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మల్లాడి వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంభర అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ బృందం వారు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చిరంజీవి మరియు మరి కొంత మంది ఇతరులపై ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ కి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. జాన్వి కపూర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... సైఫ్ అలీ ఖాన్ ఈ మూవీ లో విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ బృందం వారు హైదరాబాదు లో ఈ మూవీ కి సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

రవితేజ ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న మిస్టర్ బచ్చన్ అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ బృందం వారు ఉత్తరప్రదేశ్ లో రవితేజ మరియు కొంత మంది ఇతరులపై సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
నితిన్ ప్రస్తుతం తమ్ముడు సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ బృందం వారు ప్రస్తుతం మారేడుమిల్లి పరిసర ప్రాంతాల్లో ఈ మూవీ కి సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటున్న ఈ మూవీ ల పై జనాల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: