"గీతాంజలి 2" ట్రైలర్ విడుదల ఆ తేదీనే..!

Pulgam Srinivas
కొంత కాలం క్రితం అంజలి ప్రధాన పాత్రలో గీతాంజలి అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో శ్రీనివాస్ రెడ్డి , సత్యం రాజేష్ , షకలక శంకర్ , ఆలీ ముఖ్య పాత్రలలో నటించారు. మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయిన ఈ హార్రర్ కామెడీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను బాగా అలరించి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇలా గీతాంజలి మూవీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ సినిమాకు కొనసాగింపుగా గీతాంజలి మళ్లీ వచ్చింది అనే మూవీ ని రూపొందించారు.
 

ఈ సినిమాలో శ్రీనివాస్ రెడ్డి , సత్యం రాజేష్ , షకలక శంకర్ , సునీల్ , సత్య ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ సినిమాని ఏప్రిల్ 11 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం వారు ఈ సినిమా యొక్క ట్రైలర్ విడుదల తేదీని మరియు ఆ ట్రైలర్ ను ఏ చోట విడుదల చేయబోతున్నారు అనే విషయాన్ని తాజాగా అధికారికంగా ప్రకటించారు. ఈ మూవీ యొక్క ట్రైలర్ ను ఏప్రిల్ 3 బ తేదీన ఏ ఏ ఏ సినిమాస్ థియేటర్ లో విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేసింది.

ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతుంది. ఇకపోతే ఇప్పటికే గీతాంజలి మూవీ మంచి విజయం సాధించడంతో ఆ మూవీ కి కొనసాగింపుగా రూపొందిన "గీతాంజలి మళ్లీ వచ్చింది" సినిమాపై తెలుగు సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో ఈ మూవీ ఏ రేంజ్ లో కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబడుతుందో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: