"ఫ్యామిలీ స్టార్" మూవీని కెనడా లో విడుదల చేయనున్న ఆ ప్రముఖ సంస్థ..!

Pulgam Srinivas
విజయ్ దేవరకొండ తాజాగా ఫ్యామిలీ స్టార్ అనే మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ కి పరశురామ్ దర్శకత్వం వహించాడు. ఇది వరకు విజయ్ , పరుశురామ్ కాంబో లో గీత గోవిందం అనే లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ రూపొంది అద్భుతమైన విజయం సాధించింది . దానితో వీరి కాంబో లో రూపొందిన రెండవ సినిమా కావడంతో ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు . ఈ మూవీ లో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించగా ... గోపి సుందర్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.

దిల్ రాజు ఈ మూవీ ని నిర్మించాడు . ఈ సినిమాని ఏప్రిల్ 5 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు . ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ లను మొదలు పెట్టింది. అందులో భాగంగా ఇప్పటికే ఈ సినిమా నుండి అనేక ప్రచార చిత్రాలను విడుదల చేయగా వాటికి అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఇకపోతే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది.

ఈ మూవీ ని కెనడా లో కూడా విడుదల చేయనున్నారు. ఈ మూవీ యొక్క కెనడా హక్కులను "ది విలేజ్ గ్రూప్" సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఈ సంస్థ ఈ సినిమాను కెనడా లో భారీ ఎత్తున విడుదల చేయడానికి ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమా కెనడా ప్రజలను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో ... ఈ ఏరియాలో ఈ మూవీ ఆ స్థాయి విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

Vd

సంబంధిత వార్తలు: