నయనతార కంటే ఎక్కువ రేమ్యూనరేషన్ అందుకుంటున్న త్రిష..!?

Anilkumar
టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన త్రిష క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికే విజయవంతంగా చాలా సంవత్సరాల నుండి సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతోంది. అయితే ఈ ముద్దుగుమ్మ రెమ్యూనరేషన్ ఇతర హీరోయిన్లతో పోల్చితే కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ప్రస్తుతం ఈ బ్యూటీ ఒక్క సినిమాకు గాను ఏకంగా 12 కోట్లకు పైగానే అందుకుంటుంది అని సమాచారం. ఇక ఈ రేంజ్ లో నయనతార కూడా రెమ్యూనరేషన్ తీసుకోవడం లేదు అని తెలుస్తోంది. ప్రస్తుతం త్రిష వరుస సినిమాలు చేస్తోంది

ఆమె నటిస్తున్న సినిమాలన్నీ కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడంతో త్రిష రెమ్యూనరేషన్ ఒక్కసారిగా పెంచేసింది అని అంటున్నారు. త్రిషకి ప్రస్తుతం నాలుగు పదుల వయసు. అయినప్పటికీ ఈ రేంజ్ లో రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తుంది అంటే ఈ ముద్దుగుమ్మ క్రేజ్ అటువంటిది మరి. కానీ కొందరు మాత్రం ఏ ముద్దుగుమ్మ ఇంతటి రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తుంది అంటే తనకున్న టాలెంట్ అని కామెంట్లు పెడుతున్నారు. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియన్ సెల్వన్ సినిమాతో రీ యంట్రి ఇచ్చిన ఈ బ్యూటీ ఈ సినిమా తన జీవితాన్ని మార్చేసింది

అని చెప్పొచ్చు. ఇక ఈ సినిమా సక్సెస్ తో త్రిష ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం త్రిష కెరియర్ పరంగా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం కూడా లేదు. సెకండ్ ఇన్నింగ్స్ లో త్రిష తిరుగులేకుండా దూసుకెళుతున్నారు. భాషతో సంబంధం లేకుండా త్రిషకు ఆఫర్లు వస్తుండటం గమనార్హం. తెలుగులో సైతం విశ్వంభర  సినిమాలో ఆమె నటిస్తున్నారు. స్పెషల్ సాంగ్స్ లో కూడా నటిస్తుండటం ఆమెకు మరింత ప్లస్ అవుతోంది. కొన్ని నెలల క్రితం వరకు త్రిష పారితోషికం 6 కోట్ల రూపాయలుగా ఉండగా ఆ మొత్తాన్ని త్రిష రెట్టింపు చేసేశారు. నయనతార కూడా రాబోయే రోజుల్లో రెమ్యునరేషన్ పెంచుతారేమో చూడాల్సి ఉంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: