"టిల్లు స్క్వేర్" కి 2వ రోజు వరల్డ్ వైడ్ గా ఏరియాల వారిగా వచ్చిన కలెక్షన్స్ ఇవే..!

Pulgam Srinivas
టాలీవుడ్ నటుడు సిద్దు జొన్నల గడ్డ హీరో గా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా మల్లిక్ రామ్ దర్శకత్వంలో రూపొందిన టిల్లు స్క్వేర్ అనే మూవీ నిన్న అనగా మార్చి 29 వ తేదీన థియేటర్ లలో విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు అద్భుతమైన కలెక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా రాబట్టింది. ఈ సినిమాకు సంబంధించిన రెండు రోజులు బాక్స్ ఆఫీస్ రన్ ఇప్పటి వరకు కంప్లీట్ అయ్యింది. రెండు రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా ఏరియాల వారీగా వచ్చిన కలెక్షన్ వివరాలు తెలుసుకుందాం.
ఈ మూవీ కి 2 రోజుల్లో నైజాం ఏరియాలో 8.32 కోట్ల కలెక్షన్ లు దక్కగా ... సీడెడ్ ఏరియాలో 2 కోట్లు ... ఉత్తరాంధ్రలో 2.15 కోట్లు ... ఈస్ట్ లో 1.13 కోట్లు ... వెస్ట్ లో 67 లక్షలు , గుంటూరు లో 93 లక్షలు .... కృష్ణ లో 84 లక్షలు ... నెల్లూరు లో 57 లక్షల కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకి 2 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 16.61 కోట్ల షేర్ ... 25.50 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

ఇక ఈ మూవీ కి 2 రోజుల్లో కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలుపు కొని 1.40 కోట్ల కలెక్షన్ లు దక్కగా ... ఓవర్ సీస్ లో 7.10 కోట్ల కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా ఈ మూవీ కి మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 25.11 కోట్ల షేర్ ... 42.60 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. ఈ మూవీ కి మొత్తం గా ప్రపంచ వ్యాప్తంగా 27 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ మూవీ 28 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బారిలోకి దిగింది. ఇకపోతే ఈ మూవీ మరో 2.89 కోట్ల షేర్ కలెక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా రాబటినట్లు అయితే బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని క్లీన్ గా నిలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: