ప్రభాస్ స్పిరిట్ సినిమాలో హీరోయిన్గా మహానటి కీర్తి సురేష్..!?

Anilkumar
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరస సినిమాలు చేస్తూ బిజిగా ఉన్నాడు. ఇక ఆ సినిమాల్లో సలార్ టు కల్కి స్పిరిట్ వంటి సినిమాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాల కోసం ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తి ఎదురు చూస్తున్నారు. అయితే ఈ మూడు సినిమాల్లో కూడా ప్రభాస్ అభిమానులు ఎక్కువగా ఎదురుచూస్తున్న సినిమా ఏది అంటే అందరూ టక్కున చెప్పే పేరు స్పిరిట్ . కారణం ఏంటయ్యా అంటే.. ఈ సినిమా సందీప్ రెడ్డి వంగ ధర్షకత్వంలో వస్తుంది కాబట్టి. ఇక ఆయన దర్శకత్వంలో ఇటీవల వచ్చిన యానిమల్ సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని

అందుకుందో మనందరికీ తెలుసిందే. అందుకే ఇప్పుడు సినిమా పైన భారీ అంచనాలనుకున్నాయి. అందుకే వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమా కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు సినీ ఆడియన్స్. అయితే ఈ సందీప్ రెడ్డివంగా డైరెక్షన్లో ప్రభాస్ పర్ఫామెన్స్ ఎలా ఉండబోతోంది ఆయన యాటిట్యూడ్ కి రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోయిన్స్ తోడైతే ఎలా ఉంటుంది అని ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నారు. అయితే అన్ని బాగానే ఉన్నప్పటికీ తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

 అదేంటంటే ప్రభాస్ పోలీస్ గా కనిపిస్తున్న ఈ సినిమాలో ఆయనకి జోడిగా మహానటి ఫేమ్ కీర్తి సురేష్ హీరోయిన్ పాత్రలో కనిపించబోతోంది అన్న వార్తలు సోషల్ మీడియానే ఒక ఊపు ఊపేస్తున్నాయి. ఈ విషయంలోనే ప్రభాస్ ఫ్యాన్స్ కాస్త డిజప్పాయింట్ అవుతున్నారు. కారణం.. మహానటి తరువాత కీర్తి సురేష్ హీరోయిన్ గా వచ్చిన ఒక్క సినిమా కూడా హిట్ అవలేదు. మహేష్ బాబుతో చేసిన సర్కారువారి పాత మినహాయిస్తే.. యావరేజ్ హిట్ గా నిలిచిన సినిమా కూడా లేకపోవడం గమనార్హం. అందుకే హీరోయిన్ విషయంలో ప్రభాస్ ఫ్యాన్స్ ఫీలవుతున్నారట. అసలే స్పిరిట్ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాం. ఒక వేళా కీర్తి ప్లాప్ సెంటిమెంట్ వర్కౌట్ అయ్యి ఏదైనా తేడా కొడితే కష్టం అన్నా అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: