అందుకే మీకు "గేమ్ చేంజర్" ఫస్ట్ సింగిల్ నచ్చలేదు... దిల్ రాజు..!

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ క్రేజ్ కలిగిన నిర్మాతలలో దిల్ రాజు ఒకరు. ఈయన ఇప్పటికే ఎన్నో సినిమాలను నిర్మించి తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ ఉన్న నిర్మాతగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే చాలా సంవత్సరాల పాటు కేవలం తెలుగు సినిమాలను మాత్రమే నిర్మించిన దిల్ రాజు ప్రస్తుతం పాన్ ఇండియా మార్కెట్ పై కన్ను వేశాడు. అందులో భాగంగా ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరో గా దేశం గర్వించదగ్గ గొప్ప దర్శకులలో ఒకరు అయినటువంటి శంకర్ దర్శకత్వం లో రూపొందుతున్న గేమ్ చేంజర్ అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ ని నిర్మిస్తున్నాడు.

ఈ మూవీ లో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... ఎస్ జె సూర్య ఈ మూవీ లో విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. అంజలి , సునీల్ , శ్రీకాంత్ ఈ మూవీ లో కీలక పాత్రలలో కనిపించనుండగా ... ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇకపోతే ఈ మూవీ నుండి నిన్న అనగా మార్చి 27 వ తేదీన "జరగండి" అంటూ సాగి పాటను చిత్ర బృందం విడుదల చేసిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ మూవీ బృందం ఈ సినిమాలోని "జరగండి" పాటను విడుదల చేయక ముందే ఈ సాంగ్ లిక్ అయిన విషయం మనకు తెలిసిందే.

దానితో చిత్ర బృందం పోలీసులను కూడా ఆశ్రయించారు. నిన్న సాంగ్ విడుదల అయినప్పటికీ అదిరిపోయే రేంజ్ లో జనాలను ఆకట్టుకోలేదు. దానితో దిల్ రాజు నిన్న రామ్ చరణ్ పుట్టిన రోజు ఈవెంట్ లో భాగంగా మాట్లాడుతూ ... ఈ పాట మీకు విడుదల చేయగానే పెద్దగా ఎక్కలేదు. దానికి ప్రధాన కారణం ఇప్పటికే ఈ సాంగ్ లిక్ కావడం. కాకపోతే ఈ సాంగ్ రాబోయే రోజుల్లో మీపై బాగా ప్రభావాన్ని చూపుతుంది. అలాగే ఈ సినిమాలో ఉన్న మిగతా పాటలు కూడా అద్భుతంగా ఉండబోతున్నాయి అని తెలియజేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: