అల్లు అర్జున్ : పుష్ప 3 గురించి క్రేజీ అప్డేట్.. ఈసారి అంతకుమించి..!!

murali krishna
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప మూవీ గ్లోబల్ వైడ్ గా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. విడుదలైన అన్ని భాషల్లో అద్భుత విజయం సాధించింది. అయితే పుష్ప సినిమాను ముందుగా రెండు భాగాలుగా తెరకెక్కించాలని అనుకున్నారట. కానీ ఇప్పుడు పుష్ప 3 కూడా రానుందని సమాచారం.. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 షూటింగ్ లో చాలా బిజీగా ఉన్నాడు. 

ఈ సినిమా పూర్తయిన తర్వాత ‘పుష్ప 3’ షూటింగ్ మొదలు పెట్టనున్నారు.అయితే ‘పుష్ప’ మూవీ సెట్స్ పైకి వెళ్లినప్పుడు ఈ సినిమా  రెండు భాగాలుగా వస్తుందని ప్రకటించలేదు. తాను చెప్పాలనుకున్న కథను మరింత వివరంగా చెప్పాలంటే రెండు భాగాలుగా తెరకెక్కించాల్సిందే అని సుకుమార్ భావించారు. దాంతో ఇప్పుడు పుష్ప 2 ను మూవీని మొదలు పెట్టారు. కాగా ఇప్పుడు పుష్ప మూడో భాగం గురించి చర్చ మొదలైంది. అల్లు అర్జున్‌ కూడా ఇటీవలే పుష్ప 3 ఉంటుందని హింట్ ఇచ్చిన విషయం తెలిసిందే..తాజాగా ఈ చిత్రానికి సుకుమార్ టైటిల్ కూడా ఖరారు చేసినట్లు సమాచారం.

‘పుష్ప’ మొదటి భాగానికి ‘పుష్ప: ది రైజ్’ అని పేరు పెట్టారు. ఒక సామాన్యుడు అయిన  పుష్పరాజ్ ఎర్రచందనం సిండికేట్ కు లీడర్ గా మారడం మొదటి పార్ట్ లో చూపించారు. రెండో భాగానికి ‘పుష్ప: ది రూల్’ అనే టైటిల్ ను పెట్టారు. లీడర్ గా మారిన మారిన పుష్పరాజ్ ఎర్రచందనం స్మగ్లింగ్ ను ఎలా రూల్ చేశాడు అన్నది చూపించనున్నారు. ఇక ఇప్పుడు ‘పుష్ప: ది రోర్’ అనే పేరుతో పేరుతో మూడో భాగం సిద్ధం అవుతున్నట్లు సమాచారం.ఈ సినిమాలో అల్లు అర్జున్ మరింత మాస్ అవతార్ లో కనిపిస్తాడని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: