నాని సినిమాల లిస్ట్ లో దసరా సీక్వెల్ కూడా ఉందా...???

murali krishna
న్యాచురల్ స్టార్ నాని ఇటీవల వరుస హిట్స్ తో మంచి ఫామ్ లో ఉన్నాడు. గత సంవత్సరం దసరా, హాయ్ నాన్న సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ రెండు డిఫరెంట్ జానర్స్ తో హిట్స్ కొట్టాడు.ఇక నాని చేతిలో ప్రస్తుతం నాలుగు సినిమాలు ఉన్నాయని సమాచారం. అయితే నాని రాబోయే లిస్ట్ లో దసరా సీక్వెల్ కూడా ఉందని సమాచారం.గత సంవత్సరం మార్చిలో ‘దసరా’ సినిమా రిలిజ్ అయింది. నాని, కీర్తిసురేష్, దీక్షిత్ శెట్టి మెయిన్ లీడ్స్ గా ఫుల్ మాస్ రస్టిక్ సినిమాగా దసరా తెరకెక్కింది. కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. మొదటిసారి నాని ఈ రేంజ్ మాస్ సినిమా తీయడం. నాని ఈ రేంజ్ లో మాస్ చూపిస్తాడని ఎవ్వరూ ఊహించలేదు. ఇక సినిమా కథ కొత్తగా ఉండటం, యాక్షన్ సీన్స్ అదిరిపోవడంతో దసరా భారీ హిట్ కొట్టింది. దసరా సినిమా ఏకంగా 120 కోట్లు కలెక్ట్ చేసింది.
సినిమా చివర్లో సీక్వెల్ అనౌన్స్ చేయకపోయినా కథ ఇంకా ఏదో ఉంది అన్నట్టే వదిలేశారు. తాజాగా దసరా సినిమా సీక్వెల్ టాలీవుడ్ లో వినిపిస్తుంది. ఆల్రెడీ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఇంకో సినిమా ఉంటుందని నాని గతంలోనే తెలిపాడు. అది దసరా సీక్వెల్ అవ్వొచ్చని సమాచారం.దసరా సినిమా చివర్లో ఏడేళ్ల జైలు శిక్ష తర్వాత ధరణి, అతని ఫ్రెండ్స్ ఊళ్లోకి వస్తే ఇంకా తాగుడు వల్ల ఆ ఊరి ప్రజలు నాశనమైపోతున్నారని తెలిసి ఆ ఊరికి ఉన్న ఒక్క బార్ ని తగలబెడతాడు. దీంతో తర్వాత ఏం జరిగింది, కీర్తి సురేష్ తో పెళ్లి ప్రయాణం ఎలా ముందుకి సాగింది అనే కథతో సీక్వెల్ ఉంటుందా? లేక ఇంకేదైనా కొత్త పాయింట్ తీసుకొస్తాడా చూడాలి.శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో రూపొందిన 'దసరా' చిత్రం మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల్ని మెప్పించింది. నాని పాత్రకు మంచి ప్రశంసలు దక్కాయి. తొలి చిత్రంతోనే దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల తన ప్రతిభను చాటుకున్నాడు. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద వందకోట్ల వసూళ్లను సాధించింది. తన ద్వితీయ చిత్రాన్ని కూడా నాని హీరోగానే చేయబోతున్నానని దర్శకుడు శ్రీకాంత్‌ ఓదేల ఓ సందర్భంలో చెప్పారు.
నాని కూడా ఇదే విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కన్‌ఫర్మ్‌ చేశారు. అయితే ఈ సినిమా 'దసరా'కు సీక్వెల్‌ కాదని, సరికొత్త కథాంశంతో ఉంటుందని తెలిపారు. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో ఉంటుందని సమాచారం. ప్రస్తుతం నాని 'సరిపోదా శనివారం' చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత సుజీత్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు.మొత్తానికి నాని కెరీర్ లోనే పక్కా మాస్ సినిమా అయిన దసరాకి సీక్వెల్ ఉందని వార్తలు రావడంతో అభిమానులు ఇది నిజమైతే బాగుండు అని అంటున్నారు. మరి దీనిపై అధికారిక ప్రకటన ఎప్పుడొస్తుందో చూడాలి.ప్రస్తుతం నాని "సరిపోదా శనివారం'' అనే సినిమాలో నటిస్తున్నాడు. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా పూర్తయిన వెంటనే నాని, శ్రీకాంత్ దసరా 2ని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది మధ్యలోనే దసరా 2 ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభం కానున్నాయని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: