ఇష్క్‌ కాంబినేషన్ మళ్ళీ మ్యాజిక్ చేస్తుందా?

Purushottham Vinay
నితిన్ వరుస ప్లాపుల్లో ఉన్నప్పుడు 'ఇష్క్‌' అనే సినిమా ఇచ్చి అదిరిపోయే బ్లాక్‌బస్టర్ ఇచ్చారు విక్రమ్‌ కె కుమార్.నితిన్‌కి విక్రమ్ ఇచ్చిన విజయం చాలా పెద్దది అని చెప్పాలి. మళ్ళీ చాలా కాలం తరువాత మరోసారి ఈ ఇద్దరూ కలవబోతున్నారు. అయితే ఇప్పుడు నితిన్‌ కి ఉన్న పరిస్థితి కూడా 'ఇష్క్‌' సినిమాకు ముందు ఉన్న పరిస్థితే కావడం గమనార్హం. దీంతో మరోసారి అలాంటి హిట్ సినిమా పక్కా అని ఫ్యాన్స్‌ భావిస్తున్నారు.గతంలో వరుస ఫ్లాపుల్లో ఉన్న నితిన్‌ను మళ్ళీ హిట్ బాటలోకి మార్చిన సినిమా 'ఇష్క్'.. అప్పటి దాకా మాస్ సినిమాలే ఎక్కువగా చేస్తూ వచ్చిన నితిన్‌… ఆ మూవీతో జోనర్‌ మార్చేశాడు. ఆ సినిమా ఎఫెక్ట్‌ ఆయన ఆ తర్వాత సినిమాలకు కూడా కొనసాగించి విజయాలు అందుకున్నాడు కూడా. అలా 'ఇష్క్‌' సినిమా తర్వాత వచ్చిన 'గుండె జారి గల్లంతయ్యిందే', 'అఆ', 'భీష్మ' సినిమాలు చేశాడు.ఆ సినిమాలు తరువాత ప్రస్తుతం ఫ్లాపులు అందుకుంటున్నాడు. దీంతో నితిన్ మళ్లీ విక్రమ్‌ కె కుమార్‌ బాటలోకి వచ్చేయాలని అనుకుని ఆయననే పిలుస్తున్నారట.


ప్రస్తుతం వెంకీ కుడుమల 'రాబిన్ హుడ్', వేణు శ్రీరామ్ 'తమ్ముడు' లాంటి యాక్షన్‌ ఇంకా సెమీ యాక్షన్‌ సినిమాలతో బిజీగా ఉన్న నితిన్‌ తర్వాత పక్కాగా ప్రేమ కథ చేయాలని అనుకుంటున్నాడు. అందుకే ఈ మూవీ ప్లాన్‌ చేశారట. ఈ సినిమాని 'హను – మాన్‌'  నిర్మాత నిరంజన్‌ రెడ్డి తెరకెక్కిస్తారట. మరి ఎలాంటి కథతో విక్రమ్‌ కె కుమార్‌ వస్తారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇటీవల ఆయన సినిమాలు కూడా పెద్ద విజయాలు అందుకోలేదు. అయితే 'దూత' వెబ్‌సిరీస్‌తో మాత్రం అదరగొట్టేశారు. అప్పుడు ప్లాపుల్లో ఉన్న నితిన్ కి ఇష్క్ లాంటి బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన విక్రమ్ కుమార్ ఇప్పుడు కూడా అలాంటి కంబ్యాక్ హిట్ ఇస్తాడని నితిన్ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.మరి చూడాలి ఈ సినిమా ఆ మ్యాజిక్ ని రిపీట్ చేస్తుందో లేదో.ఇక నితిన్‌ ఇప్పుడు చేస్తున్న 'రాబిన్‌హుడ్‌', 'తమ్ముడు' గురించి కాస్త మంచి బజ్‌ ఉన్నప్పటికీ… అభిమానులు మాత్రం 'ఇష్క్‌'  పైనే ఎక్కువ ఆసక్తిగా ఉన్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: