ఆ క్రేజీ నిర్మాతతో అంజలి పెళ్లి..?

Pulgam Srinivas
తెలుగు , తమిళ సినిమాలలో నటిస్తూ అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న నటి మనులలో అంజలి ఒకరు. ఈ బ్యూటీ మొదట తమిళ సినిమాల ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకొని ఆ తర్వాత తెలుగు సినీ పరిశ్రమ వైపు అడుగులు వేసింది. అందులో భాగంగా విక్టరీ వెంకటేష్ ... సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోలుగా రూపొందిన సీతమ్మన్వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే సినిమాతో ఈ బ్యూటీ కి టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు లభించింది.

ఆ తర్వాత ఈమెకు వరుస అవకాశాలు తెలుగు సినీ పరిశ్రమలు దక్కడం ... అందులో చాలా మూవీ లు మంచి విజయాలను సాధించడంతో ఇప్పటికి కూడా ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న నటిగా కెరియర్ ను కొనసాగిస్తుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ నటి గీతాంజలి మళ్లీ వచ్చింది అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను కొన్ని రోజుల్లోనే విడుదల చేయనున్నారు. ఈ మూవీ గీతాంజలి అనే సినిమాకు కొనసాగింపుగా రూపొందుతుంది. ఈ మూవీ తో పాటు అంజలి ... మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరో గా శంకర్ దర్శకత్వం లో రూపొందుతున్న గేమ్ చెంజర్ అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతోంది.

ఈ సినిమా కనుక మంచి విజయం సాధించినట్లు అయితే ఈ ముద్దు గుమ్మ క్రేజ్ అమాంతం పాన్ ఇండియా రేంజ్ లో పెరిగే అవకాశం ఉంది. ఇకపోతే గత కొన్ని రోజులుగా ఈమెకు సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. గత కొంత కాలంగా తెలుగు సినీ పరిశ్రమలో విడాకులు తీసుకున్న అగ్ర నిర్మాతలలో ఒకరితో అంజలి డేటింగ్ చేస్తున్నట్లు త్వరలోనే ఈమె ఆ వ్యక్తిని పెళ్లి చేసుకోబోతున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో అవుతుంది. ఈ వార్త నిజమా ... అబద్దమా తెలియాలి అంటే అంజలి స్పందించాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: