ఫ్యామిలీ స్టార్ థర్డ్ సింగిల్... ట్రైలర్ విడుదలకు సంబంధించిన అప్డేట్ వచ్చేసింది..!

Pulgam Srinivas
టాలీవుడ్ యువ నటుడు విజయ్ దేవరకొండ ఈ మధ్య కాలంలో వరసగా అపజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంటూ వస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం ఈయన హీరో గా రూపొందిన లైజర్ అనే సినిమా పాన్ ఇండియా మూవీ గా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో భారీ అంచనాల నడుమ విడుదల అయింది. సూపర్ అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను ఏ మాత్రం అందుకోలేకపోయింది. దానితో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ డిజాస్టర్ ను నమోదు చేసుకుంది.
 

ఆ తర్వాత ఈ నటుడు ఖుషి అనే లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ కూడా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయ్యింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ విజయాన్ని అందుకుంది. ఇలా వరుసగా లైగర్ మరియు ఖుషి సినిమాలతో ప్రేక్షకులను అనుకున్నంత స్థాయిలో ఆకట్టుకోలేకపోయిన ఈ నటుడు ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తూ ఉండగా ... మృణాల్ ఠాకూర్ ఈ మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది.

ఈ మూవీ ని ఏప్రిల్ 5 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా లోని మూడవ పాటను మార్చి 25 వ తేదీన విడుదల చేయనున్నట్లు ... అలాగే ఈ సినిమా యొక్క ట్రైలర్ ను మార్చి 28 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: