"ఓం భీమ్ బుష్" కి మొదటి రోజు వరల్డ్ వైడ్ గా వచ్చిన కలెక్షన్స్ ఇవే..!

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ లో ప్రస్తుతం సూపర్ క్రేజ్ ఉన్న నటులలో ఒకరిగా కెరియర్ ముందుకు సాగిస్తున్న వారిలో ఒకరు అయినటువంటి శ్రీ విష్ణు ఒకరు. ఈయన ఆఖరిగా సామజవరగమన అనే సినిమాతో సూపర్ సక్సెస్ ను అందుకున్నాడు. ఇకపోతే తాజాగా శ్రీ విష్ణు "ఓం బీమ్ బుష్" అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో ప్రియదర్శి , రాహుల్ రామకృష్ణ కీలక పాత్రలలో నటించగా ... శ్రీ హర్ష కొనుగంటి ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా మార్చ్ 22 వ తేదీన మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయ్యింది.
 

మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు వరల్డ్ వైడ్ గా మంచి కలెక్షన్ లు దక్కాయి. ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు వరల్డ్ వైడ్ గా ఏ రేంజ్ కలెక్షన్ లు దక్కాయి అనే విషయాన్ని తెలియ జేస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 4.6 ప్లస్ కోట్ల కలెక్షన్ లు వచ్చినట్లు అధికారికంగా ప్రకటించింది.

ఇకపోతే ఈ మూవీ లో శ్రీ విష్ణు , ప్రియదర్శి , రాహుల్ రామకృష్ణ తమ అద్భుతమైన నటన ప్రదర్శన తో ప్రేక్షకులను ఎంత గానో ఆకట్టుకున్నారు. కామెడీ ఎంటర్టైనర్ మూవీ గా రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను ప్రస్తుతం బాగా ఆకట్టుకుంటుంది. దానితో ఈ మూవీ కి లాంగ్ రన్ లో మంచి కలెక్షన్ లు బాక్స్ ఆఫీస్ దగ్గర వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

sv

సంబంధిత వార్తలు: