"టిల్లు స్క్వేర్" సెన్సార్ కార్యక్రమాలు పూర్తి..!

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న యువ హీరోలలో సిద్దు జొన్నలగడ్డ ఒకరు . ఈయన తాజాగా టిల్లు స్క్వేర్ అనే సినిమాలో హీరో గా నటించాడు . ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ హాటెస్ట్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించ గా ... మల్లిక్ రామ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ని సీతార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సూర్య దేవర నాగ వంశీ నిర్మించాడు.
 

ఈ మూవీ ని మార్చి 29 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం వారు తాజాగా ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేశారు. ఇకపోతే ఈ మూవీ కి సెన్సార్ బోర్డు నుండి యు / ఎ సర్టిఫికెట్ లభించింది. ఈ విషయాన్ని ఈ మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

ఇకపోతే ఇప్పటికే డీజే టిల్లు మూవీ సూపర్ సక్సెస్ కావడం ఆ మూవీ కి కొనసాగింపుగా రూపొందిన సినిమానే టిల్లు స్క్వేర్ కావడం అలాగే ఇప్పటికే ఈ సినిమా నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు అన్నీ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ మూవీ పై టాలీవుడ్ సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. మరి ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగి ఉన్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మార్చి 29 వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

sj

సంబంధిత వార్తలు: