"బీమా" కి 14 రోజుల్లో వరల్డ్ వైడ్ గా వచ్చిన కలెక్షన్స్ ఇవే..!

Pulgam Srinivas
గోపీచంద్ తాజాగా బీమా అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో మాళవిక శర్మ , ప్రియ భవాని శంకర్ లు హీరోయిన్ లుగా నటించగా ... కన్నడ దర్శకుడు హర్ష ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ఈ సంవత్సరం మహా శివరాత్రి సందర్భంగా మార్చి 8 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. ఈ మూవీ ఇప్పటి వరకు 14 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ 14 రోజుల్లో ఈ సినిమాకు ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్ లు ప్రపంచ వ్యాప్తంగా దక్కాయి అనే వివరాలను క్లియర్ గా తెలుసు కుందాం.
ఈ మూవీ కి 14 రోజుల్లో నైజాం ఏరియాలో 2.91 కోట్ల కలెక్షన్ లు దక్కగా ... సీడెడ్ ఏరియాలో 1.24 కోటి ... ఏపీ లో 3.35 కోట్ల కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకి 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి 14 రోజుల్లో 7.50 కోట్ల షేర్ ... 13.05 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. ఇకపోతే ఈ మూవీ కి కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్ సీస్ లలో కలుపుకొని 71 లక్షల కలెక్షన్ లు దక్కాయి. ఈ మూవీ కి 14 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 8.21 కోట్ల షేర్ ... 15.05 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.  ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 11.30 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ 12 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. ఇకపోతే ఈ మూవీ మరో 3.79 కోట్ల షేర్ కలక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా రాబట్టినట్లు అయితే బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని క్లీన్ హీట్ గా నిలుస్తుంది. ఇక ప్రస్తుతం ఈ మూవీ కి వస్తున్న కలెక్షన్ లను బట్టి చూస్తే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకొని హిట్ స్టేటస్ ను అందుకోవడం కష్టం గానే కనిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

gc

సంబంధిత వార్తలు: