ఆ తేదీన "ఫ్యామిలీ స్టార్" ట్రైలర్..?

Pulgam Srinivas
టాలీవుడ్ యువ నటుడు విజయ్ దేవరకొండ ఈ మధ్య కాలంలో వరుస సినిమాలతో ప్రేక్షకులను పలకరిస్తున్నప్పటికీ ఈయన నటించిన సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ కాలేకపోతున్నాయి. ఆఖరుగా విజయ్ "ఖుషి" అనే లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. సమంత హీరోయిన్ గా నటించిన ఈ మూవీ కి శివ నిర్వణ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు.

ఇక ప్రస్తుతం ఈయన ఫ్యామిలీ స్టార్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. మృణాల్ ఠాగూర్ ఈ మూవీ లో హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... పరశురామ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఈ మూవీ ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఇకపోతే గతంలో విజయ్ , పరుశురామ్ కాంబోలో రూపొందిన గీత గోవిందం సినిమా మంచి విజయం సాధించడంతో వీరి కాంబో లో రూపొందుతున్న రెండవ సినిమా కావడంతో ఈ మూవీ పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.

మరి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి. ఈ మూవీ ని ఏప్రిల్ 5 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ చాలా రోజుల క్రితమే ప్రకటించింది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ యొక్క ట్రైలర్ ను విడుదల చేయాలి అనే ఉద్దేశంలో ఈ మూవీ యూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా మార్చి 25 వ తేదీన ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేసే ఆలోచనలో ఈ మూవీ బృందం ఉన్నట్లు అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన మరో ఒకటి , రెండు రోజుల్లో వెలువడబోతున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.యూ

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: