"ఓటిటి" లోకి ఎంట్రీ ఇచ్చిన హృతిక్ లేటెస్ట్ మూవీ..!

Pulgam Srinivas
బాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నటుల లో ఒకరు అయినటువంటి హృతిక్ రోషన్ తాజాగా ఫైటర్ అనే సినిమా లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే . ఈ మూవీ కి హిందీ సినీ పరిశ్రమలో దర్శకుడి గా మంచి గుర్తింపును సంపాదించుకున్న సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించ గా ... దీపికా పదుకొనే ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది . ఈ సినిమా భారీ అంచనాల నడుమ ఈ సంవత్సరం జనవరి 25 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది.

భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది . ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పర్వాలేదు అనే స్థాయిలో ఆకట్టుకున్న ఈ సినిమా తాజాగా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది . ఈ మూవీ యొక్క డిజిటల్ హక్కులను ప్రముఖ "ఓ టి టి" సంస్థలలో ఒకటి అయినటు వంటి నెట్ ఫ్లిక్స్ సంస్థ వారు దక్కించుకున్నారు.

అందులో భాగంగా ప్రస్తుతం ఈ సినిమాను ఈ "ఓ టి టి" సంస్థ వారు తమ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఇకపోతే ఎవరైనా ఈ సినిమా ను థియేటర్ లలో చూద్దాం అని మిస్ అయిన వారు ఉంటే ప్రస్తుతం ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది చూసి ఎంజాయ్ చేయండి. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ విజయాన్ని అందుకున్నప్పటికీ ఇందులోని యాక్షన్ సన్ని వేషాలకు మాత్రం ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: