"ఉస్తాద్ భగత్ సింగ్" లేటెస్ట్ వీడియోకు 24 గంటల్లో వచ్చిన రెస్పాన్స్ ఇదే..!

Pulgam Srinivas
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా రోజుల క్రితమే టాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ అనే మూవీ ని మొదలు పెట్టిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... మైత్రి సంస్థ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కొంత భాగం పూర్తి అయిన తర్వాత పవన్ ఎక్కువ శాతం రాజకీయాలపై ఫోకస్ పెట్టడం. అలాగే ఈ మూవీ తో పాటు హరిహర వీరమల్లు ... ఓజి మూవీ ల షూటింగ్ లతో కూడా బిజీ కావడంతో ఈ సినిమా షూటింగ్ తాత్కాలికంగా వాయిదా పడింది.

ఇది ఇలా ఉంటే మరి కొన్ని రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యం లో పవన్ పూర్తి గా రాజకీయాలపై ఫోకస్ పెట్టాడు. దానితో ఈ సినిమా షూటింగ్ మరికొన్ని రోజుల పాటు వాయిదా పడే అవకాశం ఉంది. దానితో హరీష్ శంకర్ ఈ గ్యాప్ లో రవితేజ హీరో గా మిస్టర్ బచ్చన్ అనే మూవీ ని పూర్తి చేస్తున్నాడు. ఇకపోతే తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి భగత్ బ్లాజ్ అనే పేరుతో ఓ చిన్న వీడియోని విడుదల చేసింది. ఈ వీడియోకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది.

ఈ వీడియోకు విడుదల అయిన 24 గంటల్లో 3.05 మిలియన్ వ్యూస్ ... 324.2 కే లైక్స్ లభించాయి. ఓవరాల్ గా చూసుకుంటే ఈ మూవీ బృందం తాజాగా విడుదల చేసిన ఈ వీడియోకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది అని చెప్పవచ్చు. ఇది వరకు పవన్ ... హరీష్ కాంబో లో రూపొందిన గబ్బర్ సింగ్ మూవీ సూపర్ సక్సెస్ కావడంతో ఈ మూవీ పై పవన్ అభిమానులతో పాటు మామూలు తెలుగు సినీ ప్రేమికుల కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: