అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి ఎంట్రీ ఇవ్వబోతున్న క్రేజీ సినిమాలు ఇవే..!

Pulgam Srinivas
ఇండియాలో అత్యంత ప్రజాదరణ పొందిన "ఓ టి టి" సంస్థలలో అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ ఒకటి. ఈ సంస్థ వారు ఎప్పటికప్పుడు అనేక సినిమాలను తమ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో విడుదల చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగా రాబోయే కాలంలో కూడా వీరు అనేక క్రేజీ సినిమాలను తమ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో విడుదల చేయబోతున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సంస్థ వారు ఓ భారీ ఈవెంట్ ను నిర్వహించి రాబోయే కొన్ని రోజుల్లో తమ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో ఏ సినిమాలను స్ట్రీమింగ్ చేయబోతున్నాము అనే విషయాలను అధికారికంగా ప్రకటించారు. ఆ సినిమాలు అవి అనే విషయాలను తెలుసుకుందాం.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందుతున్న హరిహర వీరమల్లు సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ థియేటర్ లలో విడుదల అయిన తర్వాత అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు ఈ సంస్థ వారు ప్రకటించారు. అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న గేమ్ చేంజర్ సినిమాను మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ని మరియు విజయ్ దేవరకొండ హీరో గా రూపొందుతున్న ఫ్యామిలీ స్టార్ సినిమాని మరియు అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఘాటీ మూవీ ని మరియు నితిన్ హీరోగా రూపొందుతున్న తమ్ముడు ... రిషబ్ శెట్టి హీరోగా రూపొందుతున్న కాంతార 2 ... శ్రీ విష్ణు హీరోగా రూపొందుతున్న ఓం భిమ్ బుష్ ... సూర్య హీరో గా రూపొందుతున్న కంగువా సినిమాలను థియేటర్లలో విడుదల అయిన తర్వాత కొన్ని రోజులకు తమ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ వారు తాజాగా ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: