పుష్ప 2 నుండి శ్రీవల్లి ఫోటో లీక్..!?

Anilkumar
పుష్ప 1 సినిమా ఇండియన్  బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టించిన సంచలనం గురించి ఎంత చెప్పినా తక్కువే. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించారు. కాగా ఈ సినిమా అన్ని భాషల్లో విడుదలై అన్ని భాషల్లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కాగా ఇందులోని పాటలు డైలాగ్స్ ఇండియా వైడ్ గా ఎంతలా షేక్ చేసాయో ప్రత్యేకంగా  చెప్పనవసరం లేదు. అంతేకాదు ఇందులో బన్నీ మేనరిజం యాక్టింగ్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ఇక ఇందులోని సామీ సామి పాట ఎంతటి రెస్పాన్స్ని అందుకుందో మనందరికీ తెలిసిందే.

బన్నీ రష్మిక మందన కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమాలో వీళ్ళిద్దరూ హైలెట్ గా నిలిచారు అని చెప్పొచ్చు.  ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ ఏడాది ఆగస్ట్ 15న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలో కొద్ది రోజులుగా ఈ మూవీ నుంచి కొన్ని ఫోటోస్, వీడియోస్ నెట్టింట లీక్ అవుతున్నాయి. తాజాగా రష్మిక ఫోటో లీక్ అయ్యింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్న ఫోటోలో.. ష్మిక మందన్న ఎరుపు రంగు చీర కట్టుకుంది. మెడలో బంగారు నగలు.. చేతుల నిండా గాజులు.. భారీ చెవి జుకాలు ధరించి నడుస్తూ వెళ్తుంది. ఆమెకు రక్షణగా ప్రొడక్షన్ టీమ్ ఉన్నారు.

ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది. రష్మిక చుట్టూ పెద్ద సంఖ్యలో జనం కనిపిస్తున్నారు. ఈ వీడియో రష్మిక మందన్న అభిమానుల పేజీ నుండి షేర్ చేసినట్లుగా తెలుస్తోంది. 'పుష్ప 2' నుండి శ్రీవల్లి ఫస్ట్ లుక్ ఇదే అని దాని క్యాప్షన్‌లో రాశారు.  ఇక ఇప్పటికే పుష్ప 2లో రష్మిక, బన్నీ కాంబోలో ఓ సాంగ్ పూర్తైనట్లుగా తెలుస్తోంది. అలాగే పుష్ప లాగే.. ఈసారి సెకండ్ పార్ట్ కూడా అడియన్స్ అంచనాలకు మించి ఉంటుందని గతంలో ఓ ఇంటర్వ్యూలో అన్నారు రష్మిక.  ఇదిలా ఉంటే.. ఇటీవల తన ఇన్ స్టా స్టోరీలో ఒక దేవాలయం ఫోటోను పంచుకుంటూ 'ఈరోజు షూటింగ్ పూర్తయింది. ఈ ఆలయం పేరు గాయత్రీ మందిర్. ఇది అద్భుతమైన చారిత్రక ప్రదేశం. ఈ ఆలయంలో ఎక్కువ సమయం గడపడం చాలా గొప్పగా అనిపిస్తుంది..' అంటూ పుష్ప 2 హ్యాష్ ట్యాగ్ ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: