కొత్త సినిమా అనౌన్స్ చేసిన అనుష్క శెట్టి.. టైటిల్ ఏంటంటే..!?

Anilkumar
ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి గత ఏడాది మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి అనుష్క కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమాతో ప్రేక్షకులను అలరించింది అనుష్క. ఈ సినిమా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది అని చెప్పాలి. ఇక మొదట్లో విడుదలైన కొద్ది రోజులకి ఈ సినిమా నెగిటివ్ బాట పట్టినప్పటికీ ఆ తర్వాత మంచి ఫన్ క్రియేట్ చేసింది. దీంతో ఈ సినిమా ప్రేక్షకులను బాగానే మెప్పించి అని చెప్పాలి. అయితే ఈ సినిమా తర్వాత కాస్త గ్యాప్ తీసుకుంది అనుష్క.

ప్రస్తుతం తమిళం లో సినిమాలు చేస్తుంది. తెలుగులో సైతం పలు సినిమాల్లో నటిస్తుందని తెలుస్తోంది. క్రిష్ దర్శకత్వంలో అనుష్క ఒక సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అన్న వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ సైతం ప్రకటించారట. ఈ సినిమాకి ఘాతి అనే టైటిల్ని ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే గతంలో శీలవతి అనే పేరు ఫిక్స్ చేసినట్లు వార్తలు వినిపించాయి. కానీ ఎవరూ ఊహించని టైటిల్‌ని వెల్లడించడం విశేషం. పాన్‌ ఇండియా మూవీగా దీన్ని తెరకెక్కిస్తున్నారు

దర్శకుడు క్రిష్‌. తాజాగా ఈ మూవీ ఓటీటీ ఫైనల్‌ అయ్యింది. అమెజాన్‌ ప్రైమ్‌ ఈ మూవీ ఓటీటీ హక్కులను సొంతం చేసుకుంది. సినిమా విడుదల తర్వాత ఇది అమెజాన్‌లో రాబోతున్నట్టు వెల్లడించారు. అమెజాన్‌ సంస్థ నేడు తమ సంస్థలో రాబోతున్న సినిమాలను ప్రకటించింది. అందులో ఘాతి ఉండటం విశేషం.  లేడీ ఓరియెంటెడ్‌ కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఒక సమస్యలో ఇరుక్కున్న మహిళా వ్యాపారవేత్త దాన్నుంచి ఎలా బయటపడింది, అందుకు ఎలాంటి స్ట్రగుల్‌ ఫేస్‌ చేసింది అనే కథతో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారట..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: