"బీమా" కి 10 రోజుల్లో వరల్డ్ వైడ్ గా వచ్చిన కలెక్షన్స్ ఇవే..!

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో మాస్ హీరోగా సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న మ్యాచో స్టార్ గోపీచంద్ తాజాగా బీమా అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ లో ప్రియ భవాని శంకర్ , మాళవిక మోహన్ ... గోపీచంద్ కి జోడిగా నటించగా ... హర్ష అనే కన్నడ దర్శకుడు ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ఈ సంవత్సరం మహా శివరాత్రి సందర్భంగా మార్చి 8 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యింది. ఈ సినిమా ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 10 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ 10 రోజుల్లో ఈ సినిమాకు ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్ లు దక్కాయి అనే వివరాలను తెలుసుకుందాం.
ఈ మూవీ కి 10 రోజుల్లో నైజాం ఏరియాలో 2.82 కోట్ల కలెక్షన్ లు దక్కగా ... సీడెడ్ ఏరియాలో 1.18 కోటి ... ఏపీ లో 3.21 కోట్ల కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 10 రోజుల్లో 7.21 కోట్ల షేర్ ... 12.40 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. ఇకపోతే ఈ మూవీ కి కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్ సీస్ లలో కలుపుకొని 70 లక్షల కలెక్షన్ లు దక్కాయి. ఈ మూవీ కి 10 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 7.91 కోట్ల షేర్ ... 14.39 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. ఇకపోతే ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 11.30 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ 12 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. ఇకపోతే ఈ మూవీ మరో 4.09 కోట్ల షేర్ కలక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా రాబట్టినట్లు అయితే బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని క్లీన్ హీట్ గా నిలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

gc

సంబంధిత వార్తలు: