హీరోయిన్ సురభికి తప్పిన ప్రమాదం.. జస్ట్ మిస్ అంటూ పోస్ట్..!!

Divya
సిని ప్రేక్షకులకు హీరోయిన్ సురబి బాగా సుపరిచితమే.. బీరువా, ఎక్స్ప్రెస్ రాజా, ఒక్క క్షణం తదితర చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఆ తర్వాత తెలుగులో అవకాశాలు తగ్గడంతో తమిళ ఇండస్ట్రీ వైపుగా అడుగులు వేసింది.. ప్రస్తుతం తమిళ్ తెలుగు, కన్నడ వంటి భాషలలో కూడా బాగానే గుర్తింపు సంపాదించుకుంది హీరోయిన్ సురభి.. చివరిగా యంగ్ హీరో ఆది నటించిన శశి సినిమాలో నటించింది. మ్యూజిక్ పరంగ ఈ సినిమా పాటలు హైలైట్ అయినప్పటికీ సినిమా డిజాస్టర్ గా మిగిలింది.

దీంతో మళ్లీ సురభి తెలుగులో పెద్దగా ఎక్కడ కనిపించలేదు. సోషల్ మీడియాలో మాత్రం  యాక్టివ్ గా ఉంటూ అభిమానులను ఇన్స్టా లో పలు రకాల ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.ఇప్పుడు తాజాగా ఇన్స్టాల్ షేర్ చేసిన ఒక పోస్ట్ వైరల్ గా మారింది. అదేమిటంటే జస్ట్ మిస్ చావు నుంచి తప్పించుకున్నానని ..ఊహించుకుంటూనే చాలా భయంగా ఉందంటూ రాసుకుంది.. అసలేం జరిగింది అనే విషయానికి వస్తే.. మేము విమానంలో ప్రయాణిస్తూ ఉండగా ఎప్పుడు జరగని ఒక సంఘటన ఎదురైందని తెలిపింది. తమ ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం వల్ల ప్రమాదం జరిగే పరిస్థితి ఏర్పడిందని..

ఆ సమయంలో ఫ్లైట్ కంట్రోల్ లేకుండా పోవడంతో ఫ్లైట్లో ఉన్న వారంతా పడిపోయాం దీంతో ఒక్కసారిగా తన గుండె జారినట్టుగా అనిపించిందని కానీ కొన్ని గంటల తర్వాత పైలెట్ సురక్షితంగా ఫ్లైట్ ని ల్యాండ్ చేశారు. ఆ ఘటన ఊహించుకుంటేనే చాలా భయంగా ఉన్నదంటు చావు నుంచి తప్పించుకున్నాను అంటూ ఇలా జరగడం తనలో ఉండే పాజిటివ్ థింకింగ్ కి మరింత నమ్మకాన్ని కలిగించేలా చేసింది అంటూ రాసుకుంది.. ప్రస్తుతం సురభి చేసిన ఈ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది. అయితే ఇందుకు సంబంధించి పూర్తి వివరాలను మాత్రం తెలియజేయలేదు. చిరంజీవి నటించిన విశ్వంభర అనే చిత్రంలో కీలకమైన పాత్రలో నటించబోతున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: