ఏపీ: బడా మాస్టర్ అవతారమెత్తిన నారా లోకేష్... విద్యా వ్యవస్థ ప్రక్షాళన జరిగేనా?

Suma Kallamadi
టీడీపీ కూటమి ప్రభుత్వంలో భాగంగా నారా చంద్రబాబు తనయుడు లోకేష్ కి ప్రాధాన్యత కలిగిన మంత్రిత్వ శాఖలే లభించాయి. ఆయనకు ఐటీ శాఖతో పాటుగా అదనంగా మానవవనరుల శాఖ ఇవ్వడం జరిగింది. 2014 నుంచి ఏపీలో మానవవనరుల శాఖ కింద ప్రాధమిక ఉన్నత శాఖలను కలగలిపి ఒకే గొడుగు కిందకు చేర్చారు. అంటే కేజీ నుంచి పీజీ వరకూ విద్యా వ్యవస్థ పర్యవేక్షణ అనేది ఒకే మంత్రి గారు చూస్తారు. గత వైసీపీ ప్రభుత్వంలో తొలి 3 సంవత్సరాలు ఆదిమూలం సురేష్, చివరి రెండేళ్ళూ బొత్స సత్యనారాయణ ఈ శాఖను పర్యవేక్షించారు. అదేవిధంగా 2014 టీడీపీ ప్రభుత్వంలో అయిదేళ్ల పాటు గంటా శ్రీనివాసరావు ఈ శాఖను నిర్వహించగా ఇప్పుడు తాజాగా లోకేష్ కి చంద్రబాబు ఏరి కోరి మరీ ఈ శాఖ ఇచ్చారు.
ఈ శాఖ కింద ప్రాధమిక ఎలిమెంటరీ పాఠాశాలతో పాటు విశ్వవిద్యాలయాల వరకు ఆయనే చూసుకోవాల్సి ఉంటుంది. ఇది చాలా పెద్ద శాఖ. అంటే ఇక్కడ లోకేష్ బడా మాస్టర్ అవతారం ఎత్తబోతున్నారన్నమాట. దాంతో లోకేష్ ఈ శాఖ మీద ఫుల్ ఫోకస్ పెట్టినట్టు కనబడుతోంది. ఏపీలో లక్షా పాతిక వేల పై దాటి ఉపాధ్యాయులు, వేలల్లో లెక్చరర్లు, విశ్వవిద్యాలయాలలో పనిచేసే అధ్యాపకులు ప్రొఫెసర్లు కూడా వేలల్లో ఉన్నారు. వీరందరికీ ఇపుడు సరైన దిశా నిర్దేశం చేయాల్సిన శాఖ మానవ వనరుల శాఖ.
దాంతో అందరి దృష్టి ఇపుడు ఈ శాఖపైన పడింది. ఇక టీడీపీ ఇచ్చిన కీలక హామీలలో ఒకటైన తల్లికి వందనం హామీ లోకేష్ మంత్రిత్వ శాఖలోకే వస్తుంది. దాని వల్ల వచ్చే పేరు కూడా ఆయనకే దక్కనుంది. అలాగే ఇంగ్లీష్ బోధన అనేది ఇపుడు ఉండాలా వద్దా అన్న డెసిషన్ కూడా లోకేష్ దే. బై జ్యూస్ నుంచి కంటెంట్ తీసుకుని విద్యా బోధన చేస్తున్నామని గత ప్రభుత్వం చెప్పినప్పటికీ అది ఎంతవరకు వర్కవుట్ అయిందో అందరికీ తెలిసిందే. టీచర్ల బదిలీలలో కూడా అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపణలు ఉన్నాయి. ఇక మొత్తంగా ఆంధ్రా విద్యావ్యవస్థ అస్తవ్యస్తమైనవేళ నారా లోకేష్ ఇపుడు ఇక్కడ ఎటువంటి ప్రక్షాళన చేయబోతారో చూడాలి మరి!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: