ఈ టాలీవుడ్ హీరోని గుర్తుపట్టారా.. తెలిస్తే షాక్..!!

Divya
ఒకప్పుడు ఎన్నో చిత్రాలలో నటించి అమ్మాయిల కలల రాకుమారుడు గా పేరు పొందిన హీరోలు చాలామంది ఉన్నారు. అయితే అలా చాలామంది హీరోలు కూడా తెలుగు తెర నుంచి కనుమరుగైపోయారు. అప్పటి హీరోలు ఇప్పుడు ఫోటోలు చూస్తే గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. ఇప్పుడు తాజాగా ఒక క్రేజ్ ఉన్న హీరో లుక్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.. ఆ హీరో ఎవరో కాదు ఒకప్పటి హీరో రోహిత్.. 1990 లో తన సినిమాలతో ఒక హవ కొనసాగించారు రోహిత్.

రోహిత్ తమ్మారెడ్డి భరద్వార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా పనిచేశారట. ఆ తర్వాత 2001లో వచ్చిన 16 అనే ఒక సినిమాతో హీరోగా పరిచయమయ్యారు. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకున్నది. అలా చాలా సినిమాల్లో హీరోగా నటించిన రోహిత్ ఆ తర్వాత సెకండ్ హీరోగా కూడా ఎన్నో చిత్రాలలో నటించారు. అలా సొంతం, నవవసంతం వంటి చిత్రాలలో నటించగా మంచి క్రేజ్ అందుకున్నారు. అవకాశాలు లేకున్న సమయంలో చిరంజీవి నటించిన శంకర్ దాదా ఎంబిబిఎస్, జిందాబాద్ సినిమాలలో కీలకమైన పాత్రలో నటించారు రోహిత్.

ఆ తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న రోహిత్ మళ్లీ ఇన్నేళ్లకు  తిరిగి సినిమాలలో వస్తున్నారు రోహిత్. ప్రస్తుతం రామ్ అనే ఒక సినిమాలో నటిస్తూ ఉన్నారు. ఇటీవలే తన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఒకసారిగా ఆయన అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.. అప్పట్లో లవర్ బాయ్ గా ఉన్న రోహిత్ ఇప్పుడు హీరోగా కంటే విలన్ గా మారిపోయారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.. టాలీవుడ్ హీరోలకు విలన్ గా అయితే పర్ఫెక్ట్ గా సెట్ అవుతారంటూ అభిమానులు సైతం కామెంట్స్ చేస్తున్నారు.. ఏది ఏమైనా ఒకప్పుడు హీరోలు ఈ మధ్యకాలంలో చూసి చాలామంది గుర్తుపట్టలేకపోతున్నారు. ముఖ్యంగా హీరోయిన్స్ చైల్డ్ యాక్టర్స్ కూడా అదే విధంగా మారిపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: