రజాకార్‌లో నిజాం భార్యగా అదరగొట్టిన అనుశ్రీ?

Chakravarthi Kalyan
చరిత్రలో తెలంగాణ సాయుధ పోరాటానికి ప్రత్యేక స్థానం ఉంది.  అలాంటి కథను ‘ర‌జాకార్’ రూపంలో భావోద్వేగ‌భ‌రితంగా తెర‌పై చూపించిన ప్రయత్నానికి ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన బావుంది. అందులో తన నా పాత్రకు వస్తున్న ఆదరణ చాలా సంతోషాన్ని ఇచ్చిందంటున్నారు నటి అనుశ్రీ.
రజాకార్‌ సినిమాలో తన పాత్ర గురించి.. దాని స్పందన గురించి.. ఇంకా తన అభిరుచుల గురించి అనుశ్రీ మాటల్లోనే..  
ముందుకు ‘ర‌జాకార్' చిత్రాన్ని ఇంత గొప్పగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. ‘ర‌జాకార్' ఈ నేల కథ. సినిమాకి వస్తున్న రెస్పాన్స్ చాలా ఆనందాన్ని ఇచ్చింది. సినిమా చూసిన ప్రేక్షకులు చాలా ఎమోషనల్ అవుతున్నారు. సినిమా చూస్తున్నపుడు ప్రేక్షకుల కళ్ళలో దేశభక్తి కనిపించింది. ఇంతమంచి సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శకుడు యాట సత్యనారాయణ గారిని నిర్మాత గూడూరు నారాయణ రెడ్డిగారికి ధన్యవాదాలు.
నేను బెంగళూరులో కాలేజ్ చదివాను. అక్కడే నటనపై ఆసక్తి పెరిగింది. విభిన్న పాత్రలలో నటించడం, ఆ పాత్రలలో లీనం అవ్వడం నాకు చాలా నచ్చింది. కాలేజ్ పూర్తయిన తర్వాత నేను సివిల్స్ కి చదవాలని నాన్నగారు కోరుకున్నాను. దాదాపు మూడేళ్ళు చదువుల్లోనే వున్నాను. అయితే నటిని కావాలనే కోరిక బలంగా వుండేది. ఆ కలని నెరవేర్చడం కోసం హైదరాబాద్ వచ్చాను. ఇక్కడ థియేటర్స్ వర్క్ షాప్స్ చేశాను. ఈ సినిమా లో పాత్ర కోసం దర్శకుడిని సంప్రదించాను. అప్పుడు ఆయన నిజాం భార్యగా నటించే పాత్ర కోసం వెదుకుతున్నారు. ఆ పాత్రకు నేను సరిపోతానని భావించారు.
ఇందులో నిజాం భార్యగా కనిపించా.  చాలా బలమైన అదే సమయంలో సున్నితమైన పాత్ర ఇది. వాస్తవ పరిస్థితులని నిజాంకు తెలియజేసే ఆ పాత్ర. కథ చెప్పినపుడు నా పాత్ర సవాల్ గా అనిపించింది. అలాగే ఇందులో వున్న ఏకైక గ్లామర్ రోల్ నాదే.  ఈ పాత్ర కోసం మూడు నెలలు పాటు మెథడ్ ట్రైనింగ్ కూడా తీసుకున్నాను.  ఈ పాత్ర నా కెరీర్ గొప్పగా కలిసొస్తుందని భావిస్తున్నాను.  

నాన్న సిఏ. అమ్మ గృహిణి. నేను మోడలింగ్ నుంచి కెరీర్ మొదలుపెట్టాను. గతంలో ఛత్తీస్ ఘడ్ నుంచి మిస్ ఇండియా పోటిల్లో కూడా పాల్గొన్నా. మా అమ్మ ఒకప్పుడు మోడలింగ్ కూడా చేసేవారు. అమ్మ నుంచి మోడలింగ్ పై ఆసక్తి ఏర్పడింది. అలాగే ముందుగా చెప్పినట్లు కాలేజ్ రోజుల నుంచే నటనపై ఆసక్తి వుండేది. నటనని చాలా ఆస్వాదిస్తాను. మంచి కథలో ఎలాంటి పాత్ర చేయడానికైన సిద్ధంగా వుంటాను. నాకు ఇష్టమైన హీరో ఎవరంటే.. రణబీర్ కపూర్, రామ్ చరణ్ ల నటన అంటే చాలా ఇష్టం. మహానటిలో కీర్తి గారి నటన అద్భుతం. భవిష్యత్ లో అలాంటి మంచి పాత్రలో కనిపించాలని కోరుకుంటాను.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: