హనుమాన్ సినిమా ఓటిటి రిలీజ్ పై క్లారిటీ.. ఎప్పుడంటే..!?

Anilkumar
టాలీవుడ్ హీరో తేజ నటించిన సూపర్ హిట్ సినిమా హనుమాన్ ఎంత విజయాన్ని అందుకుందో మనందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమా అధికారిక ప్రకటన తాజాగా చేసింది. ఈ సినిమా త్వరలోనే ఓటీటీ లోకి రాబోతోంది అని తమ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది. నిజానికి ఈ సినిమా శివరాత్రి సందర్భంగా ఓటీటీ లోకి వస్తుంది అని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. కానీ ఊహించని విధంగా ఈ సినిమా శివరాత్రికి రాలేదు. దాంతో ఫ్యాన్స్ అందరూ నిరాశ పడ్డారు ఈ క్రమంలో ఈ వీకెండ్ లో అయినా హనుమాన్ సినిమా వస్తుందా

 అని అందరూ ఎదురు చూస్తున్న సమయంలో g5 దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన చేయడంతో ఫాన్స్ కాస్త కూల్ అయ్యారు. "మీ ఎదురుచూపులు ఫలించే సమయం దగ్గర పడింది. ఈ ఏడాది అల్టిమేట్ సూపర్ హీరో సినిమాపై మీ ఉత్సాహాన్ని అలాగే కొనసాగించండి. హనుమాన్ జీ5లోకి త్వరలోనే రాబోతోంది" అని చెప్పింది. ఈ సందర్భంగా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, ప్రొడ్యూసర్లను కూడా ట్యాగ్ చేసింది. గత వారమే ఈ సినిమా జీ5లోకి వస్తుందని భావించినా.. రిలీజ్ కు కొన్ని గంటల ముందు నుంచీ దీనిపై ఎలాంటి సమాచారం లేదంటూ ఆ ఓటీటీ చెబుతూ వచ్చింది.

ఎప్పుడు రిలీజ్ అవుతుందో కనీసం ఆ విషయం అయినా చెప్పండని అభిమానులు అడుగుతున్నా.. దీనిపై తమ సోషల్ మీడియా హ్యాండిల్స్ ను ఫాలో అవ్వాలని మాత్రం చెప్పింది. మొత్తానికి వారం తర్వాత దీనిపై ఓ అధికారిక ప్రకటన చేసింది. ఏ రోజు నుంచి హనుమాన్ వస్తుందో స్పష్టంగా చెప్పకపోయినా.. త్వరలోనే అని మాత్రం వెల్లడించింది. దీంతో హనుమాన్ కోసం మరోసారి ఫ్యాన్స్ ఎదురు చూపులు మొదలయ్యాయి. ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 12న రిలీజైన ఈ సినిమా.. రెండు నెలలు దాటినా ఓటీటీలోకి రాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: