గోల్డ్ కలర్ టైట్ డ్రెస్ లో హాట్ యాంగిల్స్ లో మైమరపిస్తున్న పూజ హెగ్డే..!

Pulgam Srinivas
టాలీవుడ్ యువ నటుడు నాగ చైతన్య హీరో గా రూపొందిన ఒక లైలా కోసం అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ మూవీ తర్వాత నుండి ఈమెకు వరుసగా తెలుగు సినిమాల్లో అవకాశాలు దక్కాయి. అందులో భాగంగా ఎంతో మంది స్టార్ హీరోలతో నటించిన ఈ బ్యూటీ చాలా తక్కువ కాలం లోనే టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ స్థానానికి వెళ్లిపోయింది. ఇకపోతే స్టార్ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగిస్తున్న సమయం లోనే ఈ ముద్దుగుమ్మ కొన్ని సినిమాలలో ఐటమ్ సాంగ్ లలో కూడా నటించింది.
 

ఈ ఐటెం సాంగ్ లలో ఈ బ్యూటీ తన అందాలతో , డ్యాన్స్ తో ప్రేక్షకులకు ఫుల్ కిక్ ను ఎక్కించింది. ఇకపోతే ఈ బ్యూటీ ప్రస్తుతం తెలుగు కంటే కూడా తమిళ , హిందీ సినిమాలలో ఎక్కువగా నటిస్తూ వస్తుంది. మరికొన్ని రోజుల్లోనే అల్లు అర్జున్ హీరో గా అట్లీ దర్శకత్వంలో ఓ మూవీ ప్రారంభం కాబోతున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించే అవకాశం ఉన్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.
 

నిజం గానే ఈ సినిమాలో ఈమెకు అవకాశం దొరికినట్లు అయితే ఇది ఈ బ్యూటీ కి ఓ క్రేజీ ఆఫర్ అని చెప్పవచ్చు. ఇది ఇలా ఉంటే తాజాగా పూజా హెగ్డే కు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఫోటోలలో పూజ హెగ్డే అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న టైట్ గోల్డ్ కలర్ స్లీవ్ లేస్ డ్రెస్ ను వేసుకొని డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: