ఒక్కో సినిమాకి ఐశ్వర్యరాయ్ ఎన్ని కోట్ల రెమ్యూనిరేషన్ తీసుకుంటుందో తెలుసా..?

Pulgam Srinivas
ప్రపంచ వ్యాప్తంగా తనకంటూ ఆ నటి గా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న వారి లో ఐశ్వర్య రాయ్ ఒకరు . ఈమె ఇప్పటి వరకు ఎన్నో హిందీ బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకుంది . అలాగే కొన్ని ఇతర భాష సినిమాల్లో కూడా ఈమె నటించింది. ఇకపోతే చాలా సంవత్సరాలు గా హిందీ సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ ఉన్న నటిగా కెరీర్ ను కొనసాగిస్తున్న ఈమె ఎన్నో సినిమాలను తన నటనతో , అంద చందాలతో విజయం వైపు తీసుకు వెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి.

ఇకపోతే ఈమె క్రేజ్ తోనే కొన్ని సినిమాలకి అదిరిపోయే రేంజ్ ఓపెనింగ్ లు వచ్చిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. ఇలా ఇంతటి క్రేజ్ కలిగిన ఈ బ్యూటీ ఒక్కో మూవీ కి భారీ మొత్తంలో రెమ్యూనిరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఇకపోతే ఐశ్వర్య రాయ్ ఒక్కో మూవీ కి దాదాపుగా 10 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే సినిమా కథ అద్భుతంగా నచ్చి అందులో ఆమె పాత్ర కూడా ఐశ్వర్య కు విపరీతంగా నచ్చినట్లు అయితే చాలా తక్కువ మొత్తం రెమ్యూనరేషన్ కి కూడా సినిమా చేయడానికి ఈ ముద్దు గుమ్మ గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్లు తెలుస్తుంది.

అలాగే సినిమాకు దర్శకత్వం వహించబోయే దర్శకుడు ... అలాగే ఆ మూవీ నిర్మాత ను బట్టి కూడా ఈమె రెమ్యూనరేషన్ లో మార్పులు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏదేమైనప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపు కలిగిన ఐశ్వర్య రాయ్ లాంటి నటికి 10 కోట్ల రెమ్యూనిరేషన్ పెద్ద విషయం ఏమీ కాదు అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఇకపోతే ప్రస్తుతం కూడా ఐశ్వర్య రాయ్ చేతిలో అనేక క్రేజీ సినిమాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: