ఏకంగా మెగాస్టార్ చిరంజీవినే లైన్ లో పెట్టిన అనుదీప్..!?

Anilkumar
జాతి రత్నాలు సినిమాతో ఒక్కసారిగా ఫామ్ లోకి వచ్చాడు దర్శకుడు అనుదీప్. ఈ సినిమాతో డైరెక్టర్గా ఎంత పెద్ద విజయాన్ని అందుకున్నాడో ప్రత్యేకం గా చెప్పనవసరం లేదు. ఈ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్గా మారిపోయాడు అనుదీప్. అదే ఊపుతో తన రెండవ సినిమాగా ప్రిన్స్ సినిమాను తీశాడు. తమిళ హీరో శివ కార్తికేయన్ హీరోగా వచ్చిన ఈ సినిమా ఊహించని విధంగా ఫ్లాప్ అయ్యింది. దీంతో కొంతకాలంగా సైలెంట్ అయిపోయాడు అనుదీప్. అయితే తాజాగా అనుదీప్ మరొక సినిమా చేయడానికి రెడీ అయినట్లుగా తెలుస్తోంది.

ఇక టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవితోనే అనుదీప్ సినిమా చేయడానికి రెడీ అయినట్లుగా తెలుస్తోంది. అనుదీప్ సరైన స్టోరీ రెడీ చేస్తే చిరంజీవి సైతం ఈ సినిమా చేయడానికి రెడీగా ఉన్నాడు అన్న వార్తలు వినబడుతున్నాయి. ఇక ఇదివరకి చిరంజీవితో కలిసి రెండు సార్లు సినిమా విషయం గురించి కూడా అనుదీప్ చర్చించినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు చిరంజీవి అనుదీప్ చెప్పిన రెండు స్టోరీ లైన్స్ ను కూడా విన్నట్లుగా సమాచారం వినబడుతోంది. దీంతో ప్రస్తుతం ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చిరంజీవి లాంటి మెగాస్టార్ తో సినిమా చేయడం ఆషామాషీ కాదు. తనదైన కామెడీతో సినిమాలు చేసే అనుదీప్ చిరుకి ఎలాంటి స్టోరీ చెప్పాడో తెలియాల్సి ఉంది.

కామెడీ పరంగా అయితే ఒకే కానీ, యాక్షన్ పరంగా కాస్తా డౌట్ అనే టాక్ అయితే వస్తోంది. మరి చిరు అలోచించి అనుదీప్ ప్రాజెక్ట్ చేయాల్సి ఉందని సినీ సర్కిల్ లో వినిపిస్తోంది. అలాగే,అనుదీప్ తన నెక్స్ట్ సినిమాను మాస్ మహారాజ్ రవితేజతో చేయబోతున్నాడట. ఈ ప్రాజెక్టు గురించి ఇద్దరి మధ్య చర్చలు కూడా జరిగాయని, త్వరలోనే అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం ఉండాలి సమాచారం కూడా తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమాలో రవితేజకు జోడీగా శ్రద్దా శ్రీనాథ్ ను సెలెక్ట్ చేశాడట అనుదీప్. జాతిరత్నాలు తరహాలోనే అవుట్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా రానున్న ఈ సినిమాను స్వప్న సినిమాపై నాగ్ అశ్విన్ నిర్మించనున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: