అల్లు అర్జున్ తో పోటీకి సిద్ధం అయిన శివరాజ్ కుమార్..?

Pulgam Srinivas
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం "పుష్ప పార్ట్ 2" సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి సూపర్ టాలెంటెడ్ డైరెక్టర్ అయినటువంటి సుకుమార్ దర్శకత్వం వహిస్తూ ఉండగా ... నేషనల్ క్రష్ రష్మిక మందన ఈ సినిమాలో అల్లు అర్జున్ కు జోడి గా నటిస్తోంది. ఈ సినిమాను చాలా రోజుల క్రితమే ఈ సంవత్సరం ఆగస్టు 15 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది.

ఇలా ఈ సినిమా విడుదల తేదీని చాలా రోజుల క్రితమే ప్రకటించడంతో ఈ తేదీన పెద్దగా ఏ సినిమా విడుదల తేదీలు లేకుండా ఇండియా వ్యాప్తంగా మూవీ మేకర్స్ ప్లాన్ చేసుకున్నారు. ఇకపోతే ప్రస్తుతం కన్నడ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి శివరాజ్ కుమార్ "మఫ్టీ" మూవీ కి ప్రీక్వెల్ గా రూపొందుతున్న "భైరతి రణగల్" అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాను ఈ సంవత్సరం ఆగస్టు 15 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

ఇది ఇలా ఉంటే ఇప్పటికే "పుష్ప పార్ట్ 1" మూవీ సూపర్ సక్సెస్ కావడంతో "పుష్ప పార్ట్ 2" మూవీ పై ఇండియా వ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అలాగే "మఫ్టి" మూవీ కూడా మంచి విజయం సాధించడంతో మాఫ్టీ కి ప్రీక్వెల్ గా రూపొందుతున్న "భైరతి రణగల్" పై కూడా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇలా జనాల్లో భారీ అంచనాలు కలిగి ఉన్న ఈ రెండు సినిమాలు కూడా ఒక రోజు విడుదల కాబోతున్నాయి. మరి ఈ సినిమాలలో ఏ సినిమా భారీ విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

aa

సంబంధిత వార్తలు: